బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జేడీ(యూ) రథసారధి ఎవరు?
ఇప్పటిదాకా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెల్చని ఎన్‌డీఏ కూటమి..;
బీహార్(Bihar) రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Polls) జరగనున్నాయి. అయితే అధికార ఎన్‌డీఏ(NDA) ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ఇంకా ప్రకటించలేదు. దీనికి చాలా కారణాలున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) ఆరోగ్య రీత్యా ఫిట్‌గా లేరు. అలాగే లోక్ జనశక్తి పార్టీ చిరాక్ పాశ్వన్ ఇప్పటికే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొంతమంది జేడీ(యూ) నేతలు నితీష్ కుమారుడు నిషాంత్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని కోరుతున్నారు.
నిషాంత్ ఎవరు?
నిషాంత్ రెండేళ్ల క్రితం పార్టీ తరపున ప్రచారకర్తగా బీహార్ రాజకీయాల్లో అడుగుపెట్టాడు. JD(U) ప్రచార కార్యక్రమాల్లో తండ్రి తరపున పనిచేశాడు. అతని చుట్టూ చాలా అరుదుగా భద్రతా సిబ్బంది లేదా పార్టీ అనుచరులు కనిపిస్తారు. ఎల్లప్పుడూ తన తండ్రే నాయకుడని, తాను అతను కేవలం నాన్నకు సహాయం చేయడానికే ఉన్నానని గతంలో చాలాసార్లు చెప్పాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పాలక నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో నిషాంత్ ఓ మాట అన్నారు. NDA ప్రచారానికి నాన్న నాయకత్వం వహిస్తారని "అమిత్ మామ" (కేంద్ర హోంమంత్రి అమిత్ షా) స్పష్టం చేశారని" పేర్కొన్నారు.
అయితే నితీష్ ఆరోగ్య దృష్ట్యా.. ఆయన ఈ సారి ఎన్నికలలో విస్తృతంగా ప్రచారం చేయగలడా? అన్న అనుమానాలను జేడీ(యూ) నేతలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నిశాంత్‌ను ప్రత్యక రాజకీయాల్లోనే తీసుకురావాల్సిన సమయం వచ్చిందంటున్నారు.
విభేదిస్తున్న చిరాగ్ పాశ్వాన్..
లోక్ జనశక్తి పార్టీ స్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్. 2021 నుంచి లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఐదేళ్ల క్రితం బీహార్‌లో NDAతో విడిపోయి అసెంబ్లీ ఎన్నికలకు 135 మందిని LJP(RV) నిలబెట్టింది. ఈ చర్య JD(U) సీట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి లోక్ జనశక్తి పార్టీ కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకోగలిగినా.. ఆ పార్టీ అభ్యర్థులు 40 నియోజకవర్గాల్లో JD(U) అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారు. ఈసారి రాష్ట్ర రాజకీయాలకు మారి ఎన్నికల్లో పోటీ చేయాలనే తన ఆశయాన్ని చిరాగ్ ఇప్పటికే వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికలలో తేజస్వి, చిరాగ్, ప్రశాంత్ కిషోర్ వంటి యువ, ప్రతిష్టాత్మక నాయకులతో కూడా పోటీ పడనున్నాయి.