శరన్నవరాత్రులతో బలం ఫుంజుకున్న బెంగాల్ ఆర్థిక వ్యవస్థ
45 వేల నుంచి 50 వేల కోట్ల వరకూ ఆర్థిక వ్యవస్థ పెరిగే అవకాశం ఉందని అంచనా
By : The Federal
Update: 2025-09-30 11:24 GMT
భారతీయ సంప్రదాయంలో పండగలకు విశిష్ట ప్రాధాన్యం ఉంది. ప్రజలను ఐక్యపరచడానికి అలాగే దేశ ఆర్థిక వ్యవస్థలోకి ధనం ప్రవహించడానికి ఉపయోగపడతాయి. అలాంటి పండగలలో ఒకటి శరన్నవరాత్రులు. ఈ పండగ సమయంలో దుర్గాదేవీకి విశిష్ట పూజలు జరుగుతాయి.
దుర్గ పూజకు దేశంలో బెంగాల్ ప్రసిద్ధి చెందింది. ఈ పండగల వల్ల బెంగాల్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఫుంజుకుంది. గత సంవత్సరం నుంచి క్షీణించిన బెంగాల్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 10-15 శాతం వరకూ విస్తరించింది.
దీని విలువ 46000-50,000 కోట్లకు చేరుకుంది. కార్పొరేట్ స్పాన్సర్ షిప్, మాల్స్ లో జనం రద్దీ, వినియోగ వస్తువులపై పెరుగుతున్న వ్యయం, ప్రజలలో పెరిగిన ఆధ్యాత్మిక భావన వలన ఇది సాధ్యమైందని తెలుస్తోంది.
ఈ పండగను యునెస్కో గుర్తించింది. బెంగాల్, రిటైల్, ఆతిథ్యం, రవాణా, హస్తకళల రంగాల అభివృద్ది చెందడానికి ప్రధాన ఆర్థిక చోదకంగా ఉంది. దుర్గా పూజ చుట్టూ వ్యాపార కార్యకలాపాలు రాష్ట్ర జీడీపీలో కనీసం మూడింట ఒక వంతు దోహదం చేస్తాయని తరుచుగా నమ్ముతారు. బెంగాల్ లో దుర్గా పూజా ఆర్థిక వ్యవస్థ కచ్చితంగా బలమైన వృద్దిని నమోదు చేసిందని ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య పిటీఐకి తెలిపారు.
‘‘ఈ సంవత్సరం పూజా ఆర్థిక వ్యవస్థ కచ్చితంగా బలమైన వృద్దిని సాధిస్తుంది. కానీ ఇప్పుడే ఆ సంఖ్యను చెప్పడం కష్టం. వాస్తవ డేటా కోసం కార్యాలయాలు తిరిగి తెరిచే వరకూ వేచి ఉండటానికి నేను ఇష్టపడతాను’’ అని ఆమె అన్నారు. ఇది దాదాపు 15 శాతం వృద్దిని ఆశిస్తున్నారా అని అడిగినప్పుడూ ఈ విషయం చెప్పారు.
ఈ సంవత్సరం విద్యుత్ డిమాండ్ 12,050 మెగావాట్లకు చేరుకోవచ్చని రాష్ట్ర విద్యుత్ మంత్రి అరూప్ బిశ్వాస్ అన్నారు. గత సంవత్సరం ఇదే కాలంలో 9,912.71 మెగావాట్లుగా ఉందని చెప్పారు. పూజా నిర్వాహాకులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే గ్రాంట్ కొనసాగింది. ఈ సంవత్సరం దాదాపు 45 వేల కమిటీలకు ఒక్కొక్కరికి రూ. 1.1 లక్షలు అందాయి.
ఈ ప్రభుత్వ వ్యయం దుర్గా పూజ ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని మంత్రులు అన్నారు. పూజా కమిటీలకు సంబంధించిన ప్రకటనల రేట్లు పెరిగాయి. ప్రకటన ఏజెన్సీ అధికారులు ముందుగానే స్థలాలను బుక్ చేసుకున్నారని చెప్పారు.
ఈ సీజన్ పలు మేజర్లకు కొత్త వినియోగదారు ఉత్పత్తులకు లాంచ్ ప్యాడ్ గా మారింది. దీనికి తోడు జీఎస్టీలో సవరణలు కూడా డిమాండ్ పెరగడానికి కారణమైంది.
‘‘సగటు పెంపు దాదాపు 15 శాతం ఉంది. అనేక పూజా కమిటీలు కూడా తమ రేట్లను పెంచాయి. కానీ అవి గత సంవత్సరం కంటే బడ్జెట్ లపై మరింత జాగ్రత్తగా ఉన్నాయి’’ అని ఆయన అన్నారు.
గడిచిన ఏడాది బెంగాల్ పూజ ఆర్థిక వ్యవస్థ దాదాపు రూ. 42 వేల కోట్లుగా అంచనా వేశారు. ద్రవ్యోల్భణం, మ్యూట్ కార్పొరేట్ వ్యయం, బలహీనమైన సెంటిమెంట్ కారణంగా 20-30 శాతం గా కుదించబడింది.
ఆర్జీకర్ ఆస్పత్రిలో ఒక వైద్యురాలిపై అత్యాచారం, హత్య విస్తృత ఆందోళన దారితీసింది. ఇది ఆ సంవత్సరం పండగ స్ఫూర్తిపై నీలినీడలు కమ్ముకున్నాయి. అనేక వ్యాపారాలు ప్రతికూలంగా ప్రభావితమయ్యాయి.
2019 లోని బ్రిటిష్ కౌన్సిల్ నివేదిక బెంగాల్ లోని పూజ సంబంధిత సృజనాత్మక పరిశ్రమలను రూ. 32,377 కోట్లుగా అంచనా వేసింది. అయితే ఈ సంవత్సరం మాత్రం రెండంకెల ఆదాయంలో వృద్దిని నివేదించారు.
ఆభరణాల అమ్మకాలు దాదాపు 25 శాతం, పాదరక్షలు 20 శాతం, దుస్తులు 22 శాతం ఆహారం, పానీయాల అమ్మకాలు దాదాపు 18 శాతం పెరిగాయని మెర్లిన్ గ్రూప్ కార్పొరేట్ జనరల్ మేనేజర్ సుభాదీప్ బసు చెప్పారు.
సౌత్ సిటీ మాల్ అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘‘దాదాపు అందరూ తమ లక్ష్యాలను సాధించారు. వృద్ది 10-15 శాతం పరిధిలో ఉంది. వారాంతంలో పంచమి, షష్టి కలిసి వచ్చి పొడిగించిన పూజా సీజన్ ముందుగానే ప్రారంభమై అమ్మకాలను పెంచింది’’. వస్తువులు, ఆటో మొబైల్ తయారీ దారులు కూడా బలమైన అమ్మాకాలు జరిగినట్లు చెప్పారు. జీఎస్టీ సవరణతో ఇవి మరింతగా హెచ్చాయి.
అలాగే స్మార్ట్ ఫోన్ లు, టీవీలు లాంటి ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు కూడా పెరిగాయి. ఆన్ లైన్ వ్యాపారాలు చిన్న వర్తకుల ఆదాయంలో దాదాపు 40 శాతం మేర తినేశాయి. అలాగే దుర్గా పూజకు ముందు బెంగాల్ వ్యాప్తంగా కురిసిన వర్షాలు కూడా చిన్న వర్తకుల పరిస్థితిని మరింత దిగజార్చిందని సమాఖ్య అధ్యక్షుడు శక్తిమాన్ ఘోష్ జాతీయ మీడియాకు తెలిపారు.
వినియోగదారుల డిమాండ్ మొత్తం మీద పెరిగినప్పటికీ కానీ అదంతా ఎక్కువగా మాల్స్, ఇ కామర్స్ ప్లాట్ ఫాంలకు మారిందని దీనివల్ల బెంగాల్ లో అతిపెద్ద పండగ మార్కెట్ లాభాల నుంచి వాటిని మినహాయించామని చెప్పారు.