అన్యమతస్థుల దగ్గర నుంచి గణపతి విగ్రహం కొనుగోలు
మహారాష్ట్రలో ఓ సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్ వీడియో, విమర్శలు రావడంతో డీలీట్ చేసి క్షమాపణ;
By : The Federal
Update: 2025-08-26 07:59 GMT
ఓ సోషల్ మీడియా ఇన్ ప్లూయన్సర్ ముస్లిం వ్యాపారి నుంచి కొనుగోలు చేసిన గణేష్ ప్రతిమ వీడియో వివాదానికి దారితీసింది. తరువాత కంటెంట్ వీడియోను తొలగించిన అతను ఎవరి మనుసులు గాయపడి ఉంటే క్షమించాలని వేడుకున్నాడు. తాను కేవలం మతసామరస్యం గురించి చెప్పడానికే ఈ వీడియో పెట్టినట్లు చెప్పుకొచ్చారు.
రీల్ సృష్టికర్త అథర్వ సుదామే ఇటీవల పూణేలోని ఓ గణపతి విగ్రహ దుకాణంలోకి ప్రవేశించడాన్ని చూపించే ఒక రీల్ ను పోస్ట్ చేశాడు. విగ్రహం ధర ఇతర విషయాలు మాట్లాడే సమయంలో దుకాణదారుడు తన చిన్న కొడుకును ‘‘అబ్బు’’ అని పిలుస్తాడు. అతను ముస్లిం అని వివరిస్తాడు.
వీడియోలో కొనుగోలుదారుడు తన విశ్వాసం గురించి తెలుసుకున్న తరువాత విగ్రహాన్ని కొనడానికి నిరాకరించవచ్చని దుకాణదారుడు కొంచెం అసౌకర్యంగా భావించాడు. ఈ విగ్రహాలను వేరే దుకాణంలో కొనుగోలు చేయమని చెప్పడం కూడా వీడియోలో కనిపించింది.
ఇదే విగ్రహాన్ని నీ దగ్గర కొనుగోలు చేస్తే తేడా ఏం వస్తుందని అథర్వ అడిగాడు. విగ్రహాన్ని తయారు చేసేటప్పుడూ తనకు మంచి ఉద్దేశాలు ఉండి ఉంటాయని తద్వారా సామాజిక సామరస్యం సందేశాన్ని తెలియజేస్తున్నానని అతను దుకాణదారుడికి చెప్పాడు.
ట్రోలింగ్ కు దారితీసిన వీడియో..
ఈ రీల్ లో ఆన్ లైన్ లో విమర్శలకు దారితీసింది. అనేకమంది వినియోగదారులు అథర్వ ‘‘లౌకిక ఎజెండాను ముందుకు తెస్తున్నారని’’ ఆరోపించారు. ఒక కాశ్మీరీ హిందువు మాట్లాడుతూ.. ‘‘అనారోగ్య ఎజెండాను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్ని గంటల్లోనే దీనిని తొలగిస్తారు. ఎందుకు అని ఆశ్చర్య పోతున్నారా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘‘గణేష్ ఉత్సవాల సమయంలో అదే సెలెక్టివ్ లౌకికవాదం ప్రదర్శించినప్పుడూ మీ నకిలీ ప్రగతిశీల, తప్పుడు లౌకికవాదం కచ్చితంగా నలిగిపోతాయి’’ అని మరొక వినియోగదారుడు కామెంట్ చేశారు. సుధామే పుణెను తప్పుగా చూపిస్తున్నారని మరొక నెటిజన్ అన్నారు. ఈ ట్రోలింగ్ నేపథ్యంలో అథర్వ తన వీడియోను వెంటనే డిలీట్ చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పారు.
‘‘నేను ఆ వీడియోను తొలగించాను. చాలామంది తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశ్యం కాదు. హిందూ పండగలు, సంస్కృతి ఆధారంగా నేను అనేక వీడియోలను రూపొందించాను.
ఈ వీడియో వెనక నాకు ఉద్దేశ్యం లేదు. అయినప్పటికీ ఎవరైనా బాధపడితే నేను దానిని తొలగించాను. వారికి క్షమాపణలు చెబుతున్నాను’’ అని అథర్వ అన్నారు. కానీ అథర్వ వీడియోను ఎన్సీపీ నాయకుడు రోహిత్ పవార్ సమర్థించాడు.
‘‘సుధామే ఒక సృజనాత్మక వ్యక్తి. ఆ క్లిప్ లో అభ్యంతరకరమైనది ఏదీ లేదు. నిజానికి అతను హిందూ- ముస్లిం ఐక్యత సందేశాన్ని ఇచ్చాడు. ఇది హిందూ ధర్మం, సంస్కృతికి అనుగుణంగా ఉంటుంది.
కానీ కొంతమంది మనువాద శక్తులు అతన్ని ట్రోల్ చేసి ఈ వీడియోను తొలగించేలా చేశారు. ‘‘ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు వీడియోలో ఏమి తప్పు ఉందో స్పష్టం చేయాలి లేదా తనను లక్ష్యంగా చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని పవార్ అన్నారు.