బెంగాల్ ‘ఎస్ఐఆర్’ కు గవర్నర్ మద్దతు
ఆగ్రహం వ్యక్తం చేసిన టీఎంసీ
ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నా ‘ఎస్ఐఆర్’ ను పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ సమర్థించారు. దేశంలో ఎన్నికల జాబితాను ఈ ప్రక్రియ అవసరమని అన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్దరించడానికి, వ్యత్యాసాలను తొలగించడానికి ఈ ప్రక్రియ రూపొందించారని, బీహార్ ఎన్నికల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) సమర్థవంతంగా పనిచేశాయని, ఇవి ప్రజల ఆమోదం పొందిందని బోస్ అన్నారు.
‘‘ప్రజల గందరగోళంలో ఉంటే, ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా, స్వేచ్ఛగా, నిష్ఫాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూసుకోవడానికి ఎస్ఐఆర్ ఉత్తమ ప్రక్రియ అని మనం వారిని ఒప్పించాలి’’ అని బోస్ కోల్ కతలో విలేకరులతో అన్నారు.
‘‘బీహార్ దానిని నిరూపించింది. బెంగాల్ ప్రజలు కూడా దీనిని అంగీకరిస్తారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను’’ అని ఆయన అన్నారు. ఎన్నికల విశ్వసనీయతను బలోపేతం చేయడానికి విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ సవరణ డ్రైవ్ జరిగిందని అన్నారు.
ఎన్నికలకు ముందు హింస, అవినీతి నిర్మూలించాలని బోస్ అన్నారు. లేకపోతే రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్ఫాక్షికంగా ఎన్నికలు జరగవని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోందని బోస్ అన్నారు. బెంగాల్ లో ఎన్నికలు బుల్లెట్ ఆధారంగా కాకుండా బ్యాలెట్ ఆధారంగా జరగాలని ఆకాంక్షించారు.