అయోధ్య: ధ్వజారోహణ కార్యక్రమం అంటే ఏమిటీ?
అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమం
By : The Federal
Update: 2025-11-25 12:39 GMT
రామాలయ నిర్మాణం అధికారికంగా పూర్తయినందుకు గుర్తుగా, ప్రధాని నరేంద్ర మోదీ కాషాయ జెండాను ఎగురవేసిన దృశ్యాన్ని వీక్షించడానికి వేలాది మంది భక్తులు అయోధ్యలోకి తరలివచ్చారు. దీనితో నగరం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ధ్వజారోహణ వేడుక అంటే..
శ్రీ రాముడి జన్మస్థలమైన అయోధ్యలో తెల్లవారుజాము నుంచే జై శ్రీరామ్ నినాదాలు వినిపించాయి. అనేకమంది సాధువులు, యాత్రికులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
ధ్వజారోహాన్ అని పిలిచే ఈ పవిత్రకర్మకు చారిత్రాత్మక విశేషం ఉంది. జనవరి 22న, 2024న జరిగిన ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఆ తరువాత అతిపెద్ద కార్యక్రమం ఇదే. ఇది ఆలయ నిర్మాణం పూర్తిని సూచించడం తో పాటు దాని సార్వభౌమత్వాన్ని బహిరంగంగా ప్రకటించినట్లు అవుతుంది. ధ్వజారోహాణం కోసం ఆలయంలోని 44 ద్వారాలను తెరిచారు. ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా రెండో ప్రాణప్రతిష్టగా పిలుస్తారు.
శిఖరంపైన కాషాయ జెండా..
ప్రధానమంత్రి మోదీ పది అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు గల లంబకోణ త్రిభుజాకార కాషాయ జెండాను ఎగురవేశారు. ఇది శ్రీరాముని పరాక్రమానికి ప్రతీక అయిన ‘ఓం’ తో పాటు, వారి వంశమైన సూర్యుని ప్రతిమ, సాంప్రదాయ నగర శైలిలో నిర్మించిన ఆలయం, కోవిదర చెట్టు ఉన్నాయి.
ప్రధాని ఆలయంలో రామ్ దర్భార్ గర్బ్ గ్రాహ్, రామ్ లల్లా గర్భ్ గ్రాహ్ లో ప్రార్థనలు చేశారు. రామజన్మ భూమి కాంప్లెక్స్ లోపల ఉన్న సప్తమందిర్, శేషావతార్ మందిర్, మాతా అన్నపూర్ణ ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయం సముదాయంలో గోడలపై వాల్మీకీ రామాయణంలోని 87 కీలక ఘట్టాలు, భారతీయ సంస్కృతికి చెందిన 79 కాంస్య వర్ణనలు ఉన్నాయి.
ఈ రోజే ఎందుకు..
ఈ వేడుక మార్గశీర్ష మాసంలో శుక్ల పక్షంలో పంచమి, అభిజిత్ ముహూర్తం, మాతా సీతాదేవీ వివాహా పంచమి తో సమానంగా జరగుతుందని ప్రధానమంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ తేదీ 17 వ శతాబ్ధంలో అయోధ్యలో 48 గంటల ధాన్యం చేసిన గురు తేజ్ బహదూర్ బలిదానం చేసిన రోజు కూడా ఇదే. ఉదయం 11.58 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య పవిత్ర సమయంలో ఆలయ శిఖరంపైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సమక్షంలో ప్రధాని మోదీ జెండాను ఎగురవేశారు.
ఆహ్వానితులలో గిరిజనులు.. బాబ్రీ మసీదు న్యాయవాదీ..
అయోధ్య రామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా సోన్ భద్ర నుంచి గిరిజనులు, అటవీ నివాస వర్గాల ప్రతినిధులు హజరయ్యారు. ఇందులో ఇక్బాల్ అన్సారీ కూడా ఉన్నారు.
ఆయన తండ్రి హషీమ్ అన్సారీ బాబ్రీ మసీద్ కేసును వాదించారు. ఈ కార్యక్రమానికి హజరు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ సభ్యులు అతిథులను ఆహ్వానించారు. ప్రధాని పర్యటన సందర్భంగా నగర వ్యాప్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేసి, విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.