ఎన్నికల ఉచితాలను బీహార్ బడ్జెట్ భరించగలదా?

గెలుపు కోసం అధికార, ప్రతిపక్షాల పోటాపోటీ వాగ్ధానాలు

Update: 2025-10-11 06:54 GMT


వచ్చే కొన్ని రోజులలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ పాలక, ప్రతిపక్ష కూటములు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆర్థిక వాగ్ధానాల హమీలు ఇస్తున్నారు.

‘‘ది ఫెడరల్’’ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్. శ్రీనివాసన్, ది ఫెడరల్ పొలిటికల్ ఎడిటర్ పునీత్ నికోలస్ యాదవ్, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్ మెంట్ స్టడీస్ లో ఆర్థిక వేత్త కలైయసరన్ ఆర్ముగం, పాట్నాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ అశోక్ మిశ్రా పాల్గొన్న తాజా క్యాపిటల్ బీట్ లో బీహర్ ఎన్నికలకు సబంధించి పలు అంశాలను చర్చించారు.

Full View


బీహార్ లో లోతుగా పాతుకుపోయిన సామాజిక ఆర్థిక సవాళ్లకు వ్యతిరేకంగా ఈ ఉచితాల ఆర్థిక సాధ్య అసాధ్యాలు, రాజకీయ సామర్థ్యంపై చర్చ కొనసాగింది.

ఉచితాలు.. ప్రభుత్వ వ్యతిరేకత..
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన రాజకీయ జీవితంలోనే అత్యంత కఠినమైన రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఓటర్లకు అనేక ఉచితాలను అందించడం ద్వారా తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన కింద ప్రభుత్వం ఇప్పటికే 1.21 కోట్ల మంది మహిళ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 10వేలను బదిలీ చేసింది. గత రెండు మూడు రోజుల్లో ప్రకటించిన దాదాపు రూ. 50 వేల కోట్ల మొత్తం ఉచిత ప్యాకేజీలో ఇది ఒక భాగం. ఇందులోనే ఆశా కార్యకర్తలకు పెరిగిన స్టైఫండ్ కూడా ఉన్నాయి.
సీనియర్ జర్నలిస్ట్ అశోక్ మిశ్రా మాట్లాడుతూ.. బీహర్ బడ్జెట్ మొత్తం రూ. 2.50 లక్షల కోట్లు అని, ప్రభుత్వం ప్రకటించిన రూ. 50 వేల కోట్ల ప్యాకేజీ రాష్ట్రంపై గణనీయమైన భారం అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఉచితాలను ప్రధానంగా తమపై వ్యతిరేకతను ఎదుర్కోవడానికి ఉపయోగిస్తున్నారు.
ప్రతిపక్షాల వాగ్ధానం..
ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రకటిస్తున్న పథకాలను ప్రతిగా ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నాయకుడు, తేజస్వీ యాదవ్, బీహార్ లో ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హమీ ఇచ్చారు. రాష్ట్రంలో భారీగా ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ ఆర్జేడీ మాత్రం ఆర్థిక పక్షానికి ఎక్కడా తగ్గకుండా వాగ్థానాలు ఇస్తోంది. బీహర్ లో ఇప్పటికే ప్రస్తుతం దాదాపు 26 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు. రాష్ట్ర సర్వేలో దాదాపు 2.76 కోట్లు కుటుంబాలు ఉన్నట్లు వెల్లడించింది.
చర్చలో పునీత్ నికోలస్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల హమీల అమలులో చాలాసార్లు ఆర్థిక లక్ష్యాలు సాధించలేకపోయాయని చెప్పారు. బీహార్ పట్టణ ప్రాంతాలలో సగటు నెలవారీ ఆదాయం దాదాపు రూ. 2,217, గ్రామీణ ప్రాంతాలలో కేవలం రూ. 1700 గా ఉందని వివరించారు.
రాజకీయాలు లావాదేవీలుగా మారాయి. ప్రజలు తమ ఓటుకు ప్రత్యక్ష ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారు. తేజస్వీ యాదవ్ వాగ్థానం గురించి ఆర్జేడీ నాయకులు చెబతూ.. త్వరలో మ్యానిఫెస్టోలో అన్ని వివరాలు అందజేస్తారని చెప్పారు. ఉద్యోగాల కల్పనలో ఒక ముఖ్య భాగం రిజర్వేషన్లను ప్రయివేట్ రంగాలకు విస్తరించడం ముఖ్యమని వాదిస్తున్నారు. వీటికి తోడు బీహార్ నివాసి నిబంధన తీసుకొస్తున్నారు.
జనాదరణ.. ఆర్థిక నిర్మాణం..
ఆర్థికవేత్త కలైయరసన్ ఆర్ముగం మాట్లాడుతూ.. బీహార్ లో రెండు రకాల జనాలను గుర్తించారు. అందులో ఒకటి అభివృద్దిని పెంచే ఎన్నికలు.. ఇవి పోషకాహరం, విద్యా ఫలితాలను మెరుగుపరిచే మధ్యాహ్నం భోజనం వంటి అభివృద్దిని పెంచే జనాదరణ మావన మూలధనాన్ని నిర్మిస్తుంది.
దీనికి విరుద్దంగా ఐదేళ్ల కాలక్రమంలో ముడిపడి ఉచితాలు, వాటిని వస్తున్న జనాదరణ రాష్ట్ర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఉత్పాదక ఆస్తి సృష్టి నుంచి వనరులను మళ్లిస్తుంది.
బీహార్ ఆర్థిక వృద్ది ఎక్కువగా వినియోగం ఆధారితంగా ఉందని, పెట్టుబడి ఆధారితంగా లేదని ఆర్ముగం తెలిపారు. రాష్ట్రం ఉత్పత్తి చేసే ఆదాయం కంటే వినియోగం ఎక్కువగా ఉంది, ఇలా జరుగుతున్న రాష్ట్రాలలో బీహార్ ముందు వరుసలో ఉంది.
ఇది రెండు కారణాల వల్ల జరుగుతోంది. వలస కార్మికుల నుంచి ప్రయివేట్ బదిలీలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి బదిలీలు.. రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాథమిక పనితీరు కోసం తీసుకునే ఆదాయంలో దాదాపు 70 శాతం కేంద్రం నుంచి వస్తుంది. వీటిని బట్టి చూస్తే ఢిల్లీపై బీహార్ ఎక్కువగా ఆధారపడి ఉన్నట్లు స్పష్టమవుతోంది.
వినియోగం వర్సెస్ పెట్టుబడి
ఎన్నికల నగదు బదిలీలు బీహార్ దీర్ఘకాలిక అభివృద్దికి నిలకడగా లేదని చూపించడానికి ఆర్థికవేత్త డేటాను ముందుకు తెచ్చారు. బీహార్ క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి రాష్ట్రం నుంచి వస్తున్న నికర మూలధన ప్రవాహాన్ని సూచిస్తుంది.
పాట్నా లేదా గయలోని కుటుంబాలు జమ చేసిన డబ్బు తరుచుగా బీహార్ లోని ఆర్థిక కార్యకలాపాలతో తిరిగి పెట్టుబడి పెట్టకుండా బెంగళూర్ లేదాన చెన్నై వంటి నగరాలలో పెట్టుబడిగా తరలి వస్తున్నాయి.
బీహార్ నిజంగా ఎంట్ర ప్రెన్యూర్ ల రాష్ట్రం కాదని ఆర్ముగం చెప్పారు. ప్రభుత్వ ఒప్పందాలను నెరవేర్చడంలో రాష్ట్రం ముందంజలో ఉన్నప్పటికీ ప్రయివేట్ పెట్టుబడి దాదాపుగా లేదు. దాని జీఎస్డీపీలో దాదాపు 4 శాతం మూలధన నిర్మాణం ఉంది. కాబట్టి ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన అభివృద్ది నిర్మాణంతో సంబంధం లేదు.
కుల గణన వర్సెస్ పాలన ఎజెండా..
బీహార్ లో నగదు బదిలీలు ఉన్నప్పటికీ ఇక్కడ కుల ఆధారిత సమాజంలో ఇటువంటి ఉచితాలు పెద్దగా పట్టించుకోరని అశోక్ మిశ్రా చెప్పారు. ఓటర్లు ఎక్కువగా కులం ఆధారంగా విభజించబడ్డారు.
ఎన్నికల ఫలితాలు కూడా చివరికి కుల ఆధారంగా నిర్ణయం అవుతాయి. ఉచితాలు అనే ప్రజల కుల భావాలను నుంచి మళ్లించడానికి తమ వైపు తిప్పుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ అవన్నీ ఎన్నికల ప్రాధాన్యతలపై పెద్ద ప్రభావాన్ని చూపవని వాదించారు.
చర్చలో ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీ గురించి కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ అభివృద్ది, ఉద్యోగాలు, సామాజిక అభివృద్ది సమస్యలను లేవనెత్తినప్పటికీ పార్టీ విడుదల చేసిన మొదటి విడత 51 మంది లిస్ట్ లో కుల అంశాలతో సంబంధం ఉందని వక్తలు తెలిపారు.
అత్యంత వెనకబడిన కులాలకు 17 సీట్లు, వెనకబడిన కులాలకు 11 సీట్లు ఉన్నాయని మిశ్రా పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి స్థాయి జంగల్ రాజ్ యుగం కంటే ఎక్కువగా ఉందని కిషోర్ ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నాడని వక్తలు తెలిపారు.
Tags:    

Similar News