రాజ్ నాథ్ సింగ్, జైశంకర్ లను ప్రశంసించిన ప్రధాని
ఆపరేషన్ సిందూర్ చర్చలో ధీటుగా సమాధానం ఇచ్చారన్న మోదీ;
By : The Federal
Update: 2025-07-29 09:02 GMT
పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్ రెండవ రోజు చర్చకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రధాని మోదీ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ లను ప్రశంసించారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకుమంత్రులు నిన్న లోక్ సభలో ధీటైన జవాబులు ఇచ్చారు.
అద్భుతమైన ప్రసంగం..
మంగళవారం ఎక్స్ లో చేసిన ఒక పోస్ట్ లో ‘‘రక్షామంత్రి రాజ్ నాథ్ సింగ్ జీ చేసిన అద్భుతమైన ప్రసంగం, ఆపరేషన్ సిందూర్ లో భారత భద్రతా యంత్రాంగం విజయం, మన సాయుధ దళాల ధైర్యం గురించి బాగా వివరించారు’’ అన్నారు. జైశంకర్ ప్రసంగాన్ని ప్రశంసిస్తూ ‘‘విదేశాంగమంత్రి డాక్టర్ జైశంకర్ జీ ప్రసంగం అద్భుతంగా ఉంది. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడంలో భారత దృక్పథాన్ని ప్రపంచం ముందు స్పష్టంగా హైలైట్ చేశారు’’ అని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ పై చర్చను ప్రారంభిస్తూ సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారత్ ఎంతవరకైనా వెళ్లగలదని అన్నారు.
రాజ్ నాథ్ సింగ్... జై శంకర్ ?
పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ ను సాయుధ దళాలు ఆశించిన లక్ష్యాలను సాధించడంతో తాత్కాలికంగా నిలిపివేసినట్లు అయితే ఇస్లామాబాద్ మాత్రం దుస్సాహాసం జరిగితే తిరిగి ప్రారంభించవచ్చని ఆయన అన్నారు.
పహల్గామ్ దాడి తరువాత భారత్ చేసిన దౌత్య ప్రయత్నాల ఫలితంగా ఐక్యరాజ్యసమితిలో భాగమైన 190 దేశాలలో మూడు మాత్రమే ఆపరేషన్ సిందూర్ ను వ్యతిరేకించాయని జైశంకర్ అన్నారు. దాడికి గురైన దేశానికి తనను రక్షించుకునే హక్కు ఉందని జైశంకర్ తన ప్రసంగంలో విశదీకరించారు.