ఢిల్లీ స్టేషన్ తొక్కిసలాట మృతులకు రైల్వేశాఖ పరిహరం

ఒకే ఫ్లాట్ ఫాం పైకి వందలాది మంది ప్రయాణీకులు రావడంతో తొక్కిసలాట;

Update: 2025-02-16 07:03 GMT

నిన్న రాత్రి న్యూఢిల్లీ ర్వైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 18 మంది మరణించారు. వారిలో ఎక్కువమంది మహిళలు, పిల్లలు ఉన్నారు. దాదాపుగా డజన్ మందికి పైగా గాయపడ్డారు.

చనిపోయిన వారికి రైల్వేశాఖ రూ. 10 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించింది. గాయాలపాలైన వారికి లక్ష రూపాయల నష్టపరిహారం అందజేస్తామని కూడా వెల్లడించింది. 

ఈ తొక్కిసలాట ముందు మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ కు రైళ్లు ఎక్కడానికి వేచి ఉన్న ప్రయాణికుల రద్దీ 14-15 ఫ్టాట్ ఫాంలపై విపరీతంగా పెరిగిపోయింది.

తాత్కాలిక ముఖ్యమంత్రి అతిశీ విలేకరులతో మాట్లాడుతూ... సెంట్రల్ ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాశ్ ఆసుపత్రికి 15 మంది మృతదేహాలు వచ్చాయని, మరో 15 మంది గాయపడ్డారని వారికి చికిత్స కొనసాగుతోందని తెలిపారు.

కొద్ది సేపటికి గాయపడిన వారిలో మరో ముగ్గురు చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 18 కి పెరిగింది. వారిలో ఐదుగురు పిల్లలు ఉండటం అందరిని కలిచివేస్తోంది.

తొక్కిసలాటకు కారణమేంటీ?
మౌనీ అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన మరిచిపోకముందే తాజాగా ఢిల్లీలోనూ అలాంటి సంఘటన జరగడంతో దేశం ఉలిక్కిపడింది.
శనివారం రాత్రి 9.55 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీ స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. స్టేషన్ లో భారీ రద్దీ కారణంగా తొక్కిసలాట జరగిందని, ఊపిరాడక అనేక మంది ప్రయాణికులు స్పృహ కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ కోసం 14 ప్లాట్ ఫాం మీద ప్రయాణికులు వేచి ఉన్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.
స్వత్రంత సేనాని ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ లు ఆలస్యంగా నడిచాయని, ఈ రైళ్ల ప్రయాణికులు కూడా 12, 13, 14 ఫ్లాట్ ఫాం లో వేచి ఉన్నారని అధికారి వివరించారు.
‘‘ సీఎంఐ ప్రకారం దాదాపు 1500 జనరల్ టిక్కెట్లను విక్రయించారు. దీనికారణంగా స్టేషన్ రద్దీగా మారింది. ఇది కాసేపటికే నియంత్రించలేనిది మారిందని అధికారులు తెలిపారు. తొక్కిసలాట అనేది 14, 16 నంబర్ ఫ్లాట్ ఫాం వద్ద ఉన్న ఎస్కలేటర్ దగ్గర జరిగింది’’ అని డీసీపీ తెలిపారు.
Tags:    

Similar News