'వన్ నేషన్, వన్ ఎలక్షన్' ఆచరణాత్మకం కాదు

‘అసలైన సమస్యలను దాట చేసి ఎంతకాలం ఈ ప్రభుత్వం మన్నగలుగు తుంది? వాస్తవం ఏమిటంటే.. ముసాయిదా లేదు. చర్చ జరగలేదు.’ - కాంగ్రెస్

Update: 2024-09-16 12:18 GMT
Congress spokesperson Supriya Shrinate

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 'ఒకే దేశం-ఒకే ఎన్నికల' విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉందన్న వార్తలు బయటకు రావడంతో.. ఆ విధానం ఆచరణాత్మకం కాదని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రినాటే మాట్లాడుతూ.."మీరు ప్రభుత్వ వర్గాలను ఉటంకించారు. ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధిని. ఎంపిక చేసిన సమాచారాన్ని లీక్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వం ఎంతకాలం మనుగడ సాగిస్తుంది? అని ప్రశ్నించారు. అసలైన సమస్యలను దాట చేసి ఎంతకాలం ఈ ప్రభుత్వం మన్నగలుగుతుంది? వాస్తవం ఏమిటంటే.. ముసాయిదా లేదు. చర్చ జరగలేదు. సమావేశాలు జరుగుతున్నాయన్నది వాస్తవం. ప్రభుత్వం మాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదన్నది వాస్తవం.’’ అని ఆమె న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో అన్నారు.

శివసేన (యుబిటి) ఎంపి ప్రియాంక చతుర్వేది కూడా స్పందించారు. భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, జమ్మూ, కాశ్మీర్‌లో ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలను ఎందుకు నిర్వహించలేకపోయిందని అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ సిఫార్సులేమిటి?

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటయిన ఒక కమిటీ తన నివేదికలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని , అలాగే 100 రోజుల్లో స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. ఏకకాల ఎన్నికల వల్ల వనరులను ఆదాతో పాటు అభివృద్ధి, సామాజిక ఐక్యతను పెంపొందించడం, ప్రజాస్వామ్య పునాదులను మరింత బలోపేతం చేయడానికి దోహదపడతాయని ప్యానెల్ తన నివేదికలో పేర్కొంది. తమ సిఫార్సుల అమలును పరిశీలించేందుకు అమలు నిర్వాహక గ్రూపును కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. 18 రాజ్యాంగ సవరణలను కూడా ప్యానెల్ సిఫార్సు చేసింది. వీటిలో చాలా వరకు రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు. అయితే వీటికి కొన్ని రాజ్యాంగ సవరణ బిల్లులు అవసరం. వీటిని పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ప్రణాళికకు త్వరలో లా కమిషన్ ఆమోదం లభించవచ్చు. ఇది 2029 నుంచి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని సిఫారసు చేయవచ్చు.

Tags:    

Similar News