ఢిల్లీలో పాక్షికంగా కూలిన హుమయున్ సమాధి - ఐదుగురి మృతి
శిథిలాల కింద మరికొంతమంది ? కొనసాగుతున్న సహాయక చర్యలు..;
By : The Federal
Update: 2025-08-15 12:49 GMT
ఢిల్లీ(Delhi)లోని నిజాముద్దీన్ ప్రాంతంలోని హుమయున్ సమాధి(Humayun's Tomb)లో కొంత భాగం ఆగస్టు 15న కూలిపోయింది. దర్గా ప్రాంగణంలోని ఒక గది పైకప్పు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. శిథిలాల కింద 8 నుంచి 9 మంది చిక్కుకున్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు NDRF సిబ్బంది రంగంలోకి దిగారు. ఇప్పటివరకు 11 మందిని కాపాడి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. NDRFతో పాటు పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. 16వ శతాబ్దంలో నిర్మించిన ఈ స్మారక చిహ్నాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.