మంచి మిత్రుల మధ్య వివాదం లేపిన టీటీడీ లడ్డు
మంచి మిత్రులైన వారి మధ్య లడ్డూ వివాదం పాగా వేసింది. మాటలు తారా స్థాయికి చేరాయి. ట్వీట్లతో ప్రకాష్‌రాజ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఘాటుగానే హెచ్చరించారు.
ప్రకాష్‌రాజ్, పవన్ కళ్యాణ్‌లు మంచి మిత్రులు. కలిసి నటించారు. ఒకరనొకరు గౌరవించుకుంటారు. ఒకరి అభిప్రాయాలు ఒకరితో పంచుకుంటారు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటారు. ఎన్నో విషయాలు చర్చించుకుంటారు. అది సినిమా కావచ్చు. సిద్ధాంతాలు కావచ్చు. రాజకీయాలు కావచ్చు. పుస్తకాలు కావచ్చు. సాహిత్యం కావచ్చు. కళలు, కళాకారులు కావచ్చు. కానీ ఏనాడు వారి మధ్య అభిప్రాయ భేదాలు రాలేదు. పొరపుచ్చాలు తలెత్త లేదు. గత ఎన్నికల వరకు ఆ బంధం అలానే కొనసాగింది. తిరుపతి తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం తెరపైకి వచ్చే నాటి వరకు వారి బంధం ధృడంగానే ఉంది. అదంతా గతం. కానీ వారిద్దరి మధ్య పొపుచ్చాలొచ్చాయి. భేదాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. లడ్డూ వివాదం దూరడంతో అవి తారా స్థాయికి చేరుకున్నాయి.
లడ్డూ వివాదం దేశ వ్యాప్తం కావడం, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు దిగడం, హిందూ ధర్మం అపవిత్రమవుతుంటే కోపమెందుకు రావడం లేదు, బయటకు ఎందుకు రావడం లేదని డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మాట్లాడం, సనాతన ధర్మం పరిరక్షణ కోసం తన ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధమని ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ప్రకాష్‌రాజ్ ఎంట్రీ ఇచ్చారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్లతో తన అభిప్రాయాలను పోస్టు చేశారు. మీరు అధికారంలో రాష్ట్రంలో ఇది జరిగింది. విచారణ చేపట్టి దోషులను శిక్షించాలి. కానీ మీరు అది చేయడం లేదు. వివాదం సృష్టిస్తున్నారు. విద్వేషాలను రెచ్చ గొడుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు ఉన్న మత విద్వేషాలు చాలు. అంటూ తన ట్వీట్ల పరంపరను ప్రారంభించారు.