ఇంద్రకీలాద్రి రెండో రోడ్డుకు టీటీడీ నిధులు?

టీటీడీ అధికారుల సమీక్షలో సూచించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం.;

Byline :  The Federal
Update: 2025-07-12 15:04 GMT

దేవాదాయ శాఖ చట్టంలోని నిబంధనలు ఆసరాగా టీటీడీ నిధులు కూటమి మేనిఫెస్టోకు చక్కగా వాడుకుంటుంది. నిబంధనల మేరకు Common good friend- CGF కింద టీటీడీ నుంచి తీసుకునే నిధులు ఐదు శాతం నుంచి 9% వరకు పెంచామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.

రాష్ట్రంలోని 590 మంది నిరుద్యోగ వేద పండితులకు నెలకు ₹3,000 వంతున నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించినట్లు మంత్రి ఆనం చెప్పారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రి హోదాలో ఆనం రాంనారాయణరెడ్డి మొదటిసారి టిటిడి అధికారులతో శనివారం సాయంత్రం సమీక్షించారు.

తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్ చంద్ తో కలిసి టిటిడి ఈవో జే. శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తో పాటు టీటీడీలోని కీలక అధికారులతో ఆయన సుధీర్గంగా చర్చించారు.
"దేవాదాయ శాఖ - తిరుమల తిరుపతి దేవస్థానం TTD సంయుక్త సమావేశం లో కీలక అంశాల"పై చర్చించారు.
"టీటీడీలో అన్యమత ఉద్యోగులు, నిధుల వినియోగం, కామన్ గుడ్ ఫండ్ ఐదు శాతం నుంచి తొమ్మిదికి పెంపుదల" వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధాన చర్చిని అంశాలు అయ్యాయి.
"టీటీడీ నుంచి ఐదు శాతం గుడ్ ఫీల్ తీసుకునే అధికారం దేవాదాయ శాఖ చట్టంలో ఉంది" అని ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గుర్తు చేశారు. ఈ విధంగా తీసుకునే నిధులు 9 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
మేనిఫెస్టోకు...

టిడిపి కూటమి అధికారంలో రాకముందు వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించే హామీ ఇచ్చింది. దేవాదాయ శాఖ చట్టంలోని నిబంధనలను ఆసరాగా చేసుకొని గుడ్ విల్ ద్వారా వేరే పండితులకు ప్రతినెల 3 వేల రూపాయలు మృతి చెల్లించడానికి నిర్ణయం తీసుకున్నారు.
టీటీడీ ద్వారా నిర్వహిస్తున్న శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్రంలోని అనేక దేవాలయాలు పునర్నిర్మాణం చేస్తున్నారు. 147 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల కావడంతో పనులు ఆగిపోయాయని, మిగతా 11 కోట్లు కూడా విడుదల చేసి ఆలయాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు.
"ఈ అంశాలు టిటిడి పాలకమండలిలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం" అని ఈవో శ్యామలరావు మంత్రి. రామనారాయణ రెడ్డికి సమాధానం ఇచ్చారు.
ఇంద్రకీలాద్రి కి రెండో రోడ్డు
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లడానికి ఒకే మార్గం ఉంది.
"రెండో మార్గం నిర్మించడానికి టిటిడి సహకారం అందించాలి" అని మంత్రి రాం నారాయణరెడ్డి టిటిడి అధికారులను కోరారు.
దీనికి టిటిడి పాలకమండలి అంగీకరిస్తుందా? నిబంధనలు అడ్డు రావా? అంటే రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే కచ్చితంగా వందల కోట్ల రూపాయలు మంజూరు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇంద్రకీలాద్రికి రెండో రోడ్డు నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది అనే విషయాలను మంత్రి రాం నారాయణరెడ్డి వెల్లడించలేదు.
టీటీడీలో హిందూయేతరులపై ...
టీటీడీలో వెయ్యిమంది అన్యమత ఉద్యోగులు ఉన్నారనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు.
"ఈ వ్యవహారంపై ఇంకా లోతుగా దర్యాప్తు జరుగుతోంది" అని మాత్రమే చెప్పారు. టీటీడీ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణ, దేవాదాయ శాఖ ఉపకార్యదర్శి సుధాకర్ రావు, ఏపీ దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ జి.వి.ఆర్. శేఖర్, టీటీడీ, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Similar News