ఆంధ్రను ముంచెత్తిన వరదలు.. 15మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ఈ వరదల్లో 15 మంది మృతి చెందగా ముగ్గురు గల్లంతయ్యారు.

Update: 2024-09-02 06:27 GMT

ఆంధ్రప్రదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ఈ వరదల్లో 15 మంది మృతి చెందగా ముగ్గురు గల్లంతయ్యారు. భారీ సంఖ్యలో పశువులు కూడా వరదల్లో కొట్టుకుపోయాయి. విజయవాడలోని పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. కృష్ణానది పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జనజీవనం ఎక్కడిక్కడ నిలిచిపోయింది. కృష్ణలంక రిటర్నింగ్ వాల్‌కు ఉన్న రంద్రాల నుంచి భారీ మొత్తంలో వరద నీరు నగరంలోకి చేరింది. దాదాపు అన్ని భవనాలు కూడా తొలి అంతస్తు వరకు మునిగిపోయాయి. కృష్ణా నది ఉదృతి తీవ్రతరంగా ఉంది. ఈ నేపథ్యంలో నది సమీపంలోని లంక గ్రామాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశారు అధికారులు. అన్ని లంక గ్రామాలు పూర్తిగా మునిగిపోవడంతో అక్కడి ప్రజలను నిన్నటి నుంచే పునరావాస శిబిరాలకు తరలించడం వేగవంతం చేశారు. వారికి అన్ని సౌకర్యాలతో పునరావాసం కల్పిస్తున్నారు. ఈ వరదల దెబ్బకు పెదలంకలో దాదాపు 300 పాడి గేదెలు కొట్టుకుపోయినట్లు బాధితులు చెప్పారు.

ప్రమాదంలో కృష్ణా నది కరకట్ట

వరద ఉధృతి కారణంగా మంతెన సత్యనారాయణ ఆశ్రమం సమీపంలోని కరకట్టకు ఉన్న గేటు దగ్గర నీరు లీక్ అవుతుంది. దీంతో కరకట్ట ప్రమాదంలో ఉందని, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని మంత్రులు, అధికారులు పరిశీలించారు. కంకర, ఇనుప షీట్లు వేసీ జేసీబీల సాయంతో వరద నీటిని ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడ మళ్ళీ లీకేజీ ప్రారంభమైంది. దానిని నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. పెదలంకలో గేదెలు కొట్టుకుపోయిన అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా రైతులు, పశువులను ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ భయాందోళనలకు గురికావద్దని ఆయన భరోసా ఇచ్చారు.

మరణాలు ఇలా..

ఇప్పటి వరకు పడిన వర్షాలు, వచ్చిన వరదల్లో 15 మంది ప్రాణాలు కోల్పోగా ముగ్గురు గల్లంతు అయ్యారు. వీరిలో ఎన్‌టీఆర్ జిల్లా విజయవాడలోని మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో ఐదుగురు మరణించారు. విజయవాడ గ్రామాల్లో ఒకరు, జీ కొండూరు మండలంలో ఒకరు, రెడ్డి గూడెం మండలంలో మరొకరు వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లాలో కూడా ఐదుగురు వరదలకు ప్రాణాలు విడిచారు. పెదకాకాణిలోని ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు, ఒక టీచర్‌.. వరదలకు కొట్టుకుపోయారు. మంగళగిరిలో బోల్డర్ పడి ఓ మహిళ ప్రాణాలు విడిచారు. పొన్నెకల్లులో మరొకరు కూడా పొంగిపోర్లుతున్న వాగులో కొట్టుకుపోయారు. ప్రకాశం జిల్లాలో మార్కాపురం డివిజన్‌లో ఈతకని వెళ్లిన ముగ్గురు చిన్నారులు వరద నీటిలో మునిగి మరణించారు.

ఆస్తి నష్టం ఇలా..

వరదల కారణంగా ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం.. 39 పశువులు గల్లంతయ్యాయి. కృష్ణా జిల్లా పెనమలూరులో నాలుగు గొర్రెలు, ఎన్‌టీఆర్ జిల్లా గంగినేనిపాలెంలో 19 గొర్రెలు, ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఒక గేదే, నూజివీడులో ఒక గేదే, గూంటురులో మూడు గేదెలు మరణించాయి. బాపట్లలో ఒకటి, ఎన్టీఆర్ జిల్లాలో ఎనిమిది బర్రెలు, 5300 పౌల్ట్రీ జంతువులు మరణించాయి. అదే విధంగా మత్స్యకారులకు సంబంధించిన 38 పడవులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. 6 పడవులు ఓ మోస్తరుగా, 98 వలలు, 1 కమ్యూనిటీ ట్యాంక్ ధ్వంసం అయ్యాయి. వీటన్నింటిపైన ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

పరిస్థితులు పర్యవేక్షించే అధికారులు వీరే..

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. వారు క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉన్నారు. బాధితులకు అందించే పునరావాస కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు.

అధికారుల వివరాలు, ఫోన్ నెంబర్లు...

విజయవాడ సెంట్రల్

1. ఇందిరానగర్ కాలనీ- సుధాకర్ 9640909822

2. రామకృష్ణాపురం- వెంకటేశ్వర్లు 9866514153

3. ఉడా కాలనీ- శ్రీనివాస్ రెడ్డి 9100109124

4. ఆర్ఆర్ పేట- వి. పెద్దిబాబు 9848350481

5. ఆంధ్రప్రభ కాలనీ- అబ్దుల్ రబ్బానీ 9849588941

6. మధ్యకట్ట- టి. కోటేశ్వరరావు 9492274078

7. ఎల్బీఎస్ నగర్- సీహెచ్ శైలజ 9100109180

8. లూనా సెంటర్- పి. శ్రీనివాసరావు 9866776739

9. నందమూరి నగర్- యు. శ్రీనివాసరావు 9849909069

10. అజిత్సింగ్ నగర్- కె. అనురాధ 9154409539

11. సుబ్బరాజునగర్- సీహెచ్ ఆశారాణి 9492555088

12. దేవినగర్ - కే.ప్రియాంక 8500500270

13. పటేల్ నగర్- కె. శ్రీనివాసరావు 7981344125

విజయవాడ పశ్చిమ

14. జోజినగర్- వీకే విజయశ్రీ 9440818026

15. ఊర్మిలా నగర్- శ్రీనివాస్ 8328317067

16. ఓల్డ్ ఆర్ఆర్ పేట- ఎస్ఏ ఆజీజ్ 9394494645

17. పాల ఫ్యాక్టరీ ఏరియా- జె. సునీత 9441871260

విజయవాడ తూర్పు

18. రాజరాజేశ్వరీ నగర్- పి. వెంకటనారాయణ 7901610163

19. మహానాడు రోడ్డు- పి.బాలాజీ కుమార్ 7995086772

20. బ్యాంకు కాలనీ- హేమచంద్ర 9849901148

21. ఏపీఐఐసీ కాలనీ- ఎ. కృష్ణచైతన్య 9398143677

22. కృష్ణలంక - పీఎం సుభాని 7995087045

23. రామలింగేశ్వరనగర్- జి. ఉమాదేవి 8074783959

విజయవాడ రూరల్

24. గొల్లపూడి- ఈ. గోపీచంద్ 9989932852

25. రాయనపాడు- సాకా నాగమణెమ్మ 8331056859

26. జక్కంపూడి - నాగమల్లిక 9966661246

27. పైడూరుపాడు- శ్రీనివాస్యాదవ్ 7416499399

28. కేవీ కండ్రిక- మహేశ్వరరావు 9849902595

29. అంబాపురం- బి. నాగరాజు 8333991210

Tags:    

Similar News