మూడో జాబితాలో 21 మంది

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల మూడో జాబితా గురువారం రాత్రి విడుదలైంది.;

Byline :  The Federal
Update: 2024-01-11 17:18 GMT
YSRCP

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో జాబితా విడుదల చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను మార్చే కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడతలుగా 35 నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను ప్రకటించారు. మూడో జాబితా గురువారం రాత్రి విడుదల చేశారు. మొత్తం 15 అసెంబ్లీ, ఆరు పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను వైఎస్సార్‌సీపీ ప్రకటించింది.

మూడో జాబితాలో విశాఖపట్నం పార్లమెంట్‌కు బొత్స ఝాన్సీ లక్ష్మీ, ఏలూరు కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్, శ్రీకాకుళం పేరాడ తిలక్, తిరుపతి కోనేటి ఆదిమూలం, కర్నూలు గుమ్మనూరు జయరాం, విజయవాడ కేశినేని (శ్రీనివాస్‌) నానిలను ఖరారు చేశారు. అలాగే అసెంబ్లీ స్థానానాలకు సంబంధించి ఇచ్చాపురం పిరియా విజయ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి (ఎస్సీ) కంభం విజయరాజు, పూతలపట్టు (ఎస్సీ) మూతిరేవుల సునీల్‌కుమార్, ఆలూరు బూసినె విరూపాక్షి, చిత్తూరు విజయానందరెడ్డి, మదనపల్లి నిస్సార్‌ అహ్మద్, రాజంపేట ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, చింతలపూడి కె విజయరాజు, కోడుమూరు (ఎస్సీ) డాక్టర్‌ సతీష్, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, గూడూరు (ఎస్సీ) మేరిగ మురళి, సత్యవేడు (ఎస్సీ) మద్దిల గురుముర్తి, పెనమలూరు జోగి రమేష్, పెడన ఉప్పాల రాము పేర్లు ప్రకటించారు.
పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారధికి సీటు దక్కలేదు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ను పెనమలూరు ఇన్‌చార్జ్‌గా నియమించి పెడన ఇన్‌చార్జ్‌గా ఉప్పాల రామును నియమించారు. ప్రస్తుతం ఈయన భార్య మచిలీపట్నం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. తిరుపతి ఎంపీగా ఉన్న మద్దిల గురుముర్తిని సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తిరుపతి ఎంపీగా టిక్కెట్‌ ఇచ్చారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి టిక్కెట్‌ ఇవ్వకుండా ఆ స్థానంలో మెట్టు గోవిందరెడ్డికి టిక్కెట్‌ ఇచ్చారు. టెక్కలి నుంచి టిడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడుపై పోటీకి ఎంఎల్‌సీ దువ్వాడ శ్రీనివాస్‌ను నియమించారు. గత ఎన్నికల్లో అచెన్నాయుడుపై ఓటమి చెందటంతో ఎమ్మెల్సీ ఇచ్చారు. మంత్రి గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీగా నియమించడం పలువురిలో చర్చకు దారి తీసింది. విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన కే శినేని నానీకి టిక్కెట్‌ ఇచ్చారు. మార్పులు, కొత్తవారి నియామకాలు రాష్ట్రంలో చర్చకు దారితీశాయి. వైఎస్సార్‌సీపీ స్ట్రాటజీ ఏంటనే చర్చ కొనసాగుతోంది.


Tags:    

Similar News