ఆంధ్రలో తీవ్ర వడగాలులు.. 234 మండలాలకు అలెర్ట్

ఆంధ్రలో వడగాలులు తీవ్రత పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల సంస్థ కూర్మనాథ్ తెలిపారు. రేపు 234 మండలాల్లో వడగాలులు వీయొచ్చని అంచనా వేశారు.

Update: 2024-05-01 14:42 GMT

ఆంధ్రలో వేసవి ఎండలు మండుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలతో పాటు రాష్ట్రంలో వీస్తున్న వడగాలులు తీవ్రత కూడా అధికం అవుతోంది. ప్రతి రోజు తీవ్ర స్థాయి నుంచి ఒక మోస్తరు వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయన్న మండలాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేథ్యంలో రేపు ఎల్లుండి రాష్ట్రంలో దాదాపు 234 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే రేపు 31 మండలాల్లో తీవ్ర స్థాయి వడగాలులు, 234 మండలాల్లో ఒక మోస్తరు వడగాలులు వీసే అవకాశాలు వీసే అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

ఈ మండలాల్లోనే

రేపు శ్రీకాకుళం 5 , విజయనగరం 15, పార్వతీపురం మన్యం 8 , ప్రకాశం 2, అల్లూరి సీతారామరాజు ఒక మండలంలో తీవ్ర వడగాలులు వీసే అవకాశాలు ఉన్నాయని, అదే విధంగా శ్రీకాకుళం15 , విజయనగరం 10, పార్వతీపురం మన్యం 7, అల్లూరి సీతారామరాజు 9, విశాఖపట్నం 1, అనకాపల్లి 15, కాకినాడ 13, కోనసీమ 9, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 1, ఏలూరు 18, కృష్ణా 11, ఎన్టీఆర్ 11, గుంటూరు 16, పల్నాడు 21, బాపట్ల 11, ప్రకాశం 18, తిరుపతి 12, నెల్లూరు16, అనంతపురం 1, వైఎస్ఆర్ 5 మండలాల్లో ఒక మోస్తరు వడగాలులు వీయొచ్చని కూర్మనాథ్ వివరించారు.

అయితే ఎల్లుండి(శుక్రవారం) ూడా సుమారు 30 మండలాల్లో తీవ్ర స్థాయిలో, 121 మండలాల్లో ఒక మోస్తరు వడగాలులు వీయొచ్చని సంస్థ అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్రంలో వడగాలులు పెరుగుతున్న క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్లే పనులను వాయిదా వేసుకోవాలని కూర్మనాథ్ సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు తప్పని పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని, బయటకు రావాల్సిందే అన్న సమయాల్లో ముఖానికి స్కార్ఫ్, కర్చీఫ్ వంటివి ధరించాలని, ప్రతి 20 నిమిషాలకు ద్రావణాలు ఏవైనా తీసుకోవాలని వివరించారు. అయితే కూల్ డ్రింక్స్, కాఫీ, టీ, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని తెలిపారు. గర్బిణులు, వృద్ధులు, బాలింతలు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఏమాత్రం అనుమానంగా ఉన్నా వైద్యుల సహకారం అందించాలని వివరించారు. ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా 46.2 సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత, అత్యల్పంగా 43 సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు.

Tags:    

Similar News