సింహాచలం గుడిలో గోడ కూలి 8 మంది మృతి
చందనోత్సవంలో విషాదం;
విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానంలో చందనోత్సవం సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది . ఆలయ ప్రాంగణంలో రూ. 300 టికెట్ కౌంటర్ దగ్గిర ఒక సిమెంట్ గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది భక్తులు మృతిచెందారు. బుధవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షాలకు మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరొక పది మందికి గాయాలయ్యాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో మృతి కారణమయింది.
స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు గోడ దగ్గిర ఉన్నపుడు ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు ఆరు మృతదేహాలు వెలికి తీశారు. శిథిలాల కింద మరో రెండు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం.
ప్రమాద స్థలానికి వెంటనే చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులు సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారు