పద్మావతీ అమ్మవారికి మహిళల కర్పూర నీరాజనం

తిరుచానూరులో⁠ ⁠వైభవంగా రథోత్సవం

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-24 08:24 GMT

తిరుచానూరు పద్మావతీ అమ్మవారి పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మత్సవాలు కనువిందుగా సాగుతున్నాయి. సోమవారం ఉదయం సర్వాంగసుందరంగా అమ్మవారి విగ్రహాన్ని అలంకరించారు.


ఆకాశమంత ఎత్తైన రథాన్ని రంగురంగుల పరదాలతో సింగారించారు. దేశవిదేశీ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆ రథంపై పద్మావతీ అమ్మవారి విగ్రహాన్ని ఆశీనులను చేసి, నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. రథంపై విహరిస్తే పద్మావతీ అమ్మవారు మాడవీధుల్లో వేచి ఉన్న యాత్రికులకు దర్శనం ఇచ్చారు. సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ రథోత్సవం యాత్రికులకు కనువిందు చేసింది.


అమ్మవారికి కర్పూరనీరాజనం..

తిరుచానూరు అనేది ఓపల్లె. ప్రతి ఇంటి నుంచి మహిళలు ఉత్సవాలకు రావడానికి ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మవారి ఊరేగింపు చూసి తరలించడానికి ఆసక్తి చూపించే మహిళలు రథోత్సవం రోజు మాత్రం మరింత భక్తిని చాటుకుంటారు. అం దులో భాగంగానే అమ్మవారి రథ మాడవీధుల్లో ఊరేగే సమమంలో మహిళలు అడుగడుతునా కర్పూరనీరాజనాలు అందించారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం ఉదయం రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం 9.15 గంటలకు ధనుర్ లగ్నంలో ర‌థోత్స‌వం మొద‌లైంది. ఆలయ నాలుగు మాడవీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగాడానికి పోటీ పడ్డారు.

కోరికలు సిద్ధిస్తాయనేది నమ్మకం


సర్వాలంకార శోభితమైన రథంపై ప్రకాశించే అలమేలుమంగ (పద్మావతీ అమ్మవారు) సకలదేవతా పరివారంతో విహరిస్తూ, యాత్రికులకు దర్శనం ఇచ్చారు. తిరుచానూరులో పద్మావతీ అమ్మవారు రథంపై ఊరేగే సమయంలో దర్శనం చేసుకుంటే కోరికలు సిద్ధస్తాయనేది యాత్రికుల విశ్వాసం.

తిరుమల జీయర్ స్వాములు శ్రీశ్రీశ్రీపెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న య‌ర్‌స్వామి, ఏమన్నారంటే..

"ఇది రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయాల్లో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది" అని జీయర్ స్వాములు అభిభాషణ చేశారు.

పద్మావతీ అమ్మవారి రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మవారికి రథమండపంలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేస్తారు. ఈ కార్యక్రమాల్లో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, సీవీఎస్వో కేవి. మురళీకృష్ణ, జేఈఓ వి. వీరబ్రహ్మంతో పాటు అనేక మంది అధికారులు రధం లాగడానికి ఉత్సాహం చూపించారు.


తిరుచారూరులో సోెమవారం రాత్రి ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అశ్వవాహనంపై అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఆలయ డెప్యూటీ ఈఓ హరింద్రనాథ్, ఆలయ అర్చకులు, బాబుస్వామి, శ్రీనివాసాచార్యులు, అర్చకులు, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Tags:    

Similar News