బెట్టింగ్‌కు బానిసయ్యాడు–సర్వం పోగొట్టుకున్నాడు
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నాయి.;
ఆన్‌లైన్ బెట్టింగ్‌లు కుటుంబాలను చిద్రం చేస్తున్నాయి. ఆనందంగా బతుకుతున్న జీవితాలను పీల్చి పిప్పి చేసి రోడ్డున పడేస్తున్నాయి. చిన చిన్నంగా అలవాటు పడిన వారు క్రమంగా బానిసలవుతున్నారు. దానిలోనుంచి తేరుకునే లోపే వారి కుటుంబాలు బజారున పడుతున్నాయి. అన్నీ పోగొట్టుకుని చివరకు కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరి కొంత మంది ఇళ్లు.. ఊర్లు వదిలి వెళ్లి పోతున్నారు. అందరూ ఉన్నా ఆఖరుకు అనాధలుగా మారి ఆఖరుకు శవాలై తేలుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఆన్‌లైన్ జూదానికి బానిసగా మారిన ఓ ప్రబుద్ధుడు సర్వం పోగొట్టుకుని ఇల్లు కాదు, ఊరే విడిచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. డబ్బులు పోయినా పర్వాలేదు మనిషే లేకుండా పోయాడని తీవ్ర దుఃఖంలో మునిగి పోయారు. వెతికి పెట్టి అప్పగించమని పోలీసులను వేడుకున్నారు.