విమాన ప్రయాణం 'దైవా'దీనమేనా..!

ప్రయాణికుల సహనానికి పరీక్షగా మారుతోంది. తిరుపతి విమానాశ్రయంలో యాత్రికుల పరిస్థితి ఏమిటి? ఏమి జరిగింది?

Byline :  SSV Bhaskar Rao
Update: 2024-11-12 07:14 GMT

విమానప్రయాణం కొందరికి యాతన కలిగిస్తోంది. గమ్యస్థానం చేరేవరకు గాలిలో ప్రయాణిస్తామా? లేదా? అనేది కూడా సందేహాస్పదంగా మారుతోంది. తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. తరచూ ప్రయాణికులు ఇక్కడ నిరసనలకు దిగడం పరిపాటిగా మారింది. విమానసర్వీసులు రద్దు చేస్తే, ముందుగా సమాచారం ఇవ్వడం లేదు. దీంతో ప్రయాణికులకు నిరసనలకు దిగడం పరిపాటిగా మారింది. తాజా ఘటన ఇది.

సామాన్యుడి కూడా విమానసేవలు అందుబాటలులోకి తీసుకుని రావాలనేది ప్రభుత్వ సంకల్పం. ఆ దిశగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విమానసర్వీసులు కూడా పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అదే సమయంలో "విమాన చార్జీల తగ్గింపు విషయంలో కూడా ఆయా సంస్థలతో మాట్లడడంతో పాటు, ఆ దిశగా దృష్టిసారిస్తా" అని కూడా ఆయన స్పస్టం చేయడం గమనార్హం. కాగా, విమానాశ్రయ అధికారుల తీరుమాత్రం ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది.

ఇదే సాక్ష్యం

హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రతిరోజూ ఉదయం విమానసర్వీసు ఉంది. ఉదయం హైదరాబాద్ లో 7.15 బయటలుదేరాలి. తిరిగి ఉదయం 8.15 నిమిషాలకు వెళ్లాలి. ఇది ఈ ఫ్లైట్ షెడ్యూల్. ఈ విమానం మంగళవారం రద్దు చేశారు. ఎందుకు అనేది కారణం తెలియదు. ఈ విమానంలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు రేణిగుంట (తిరుపతి) విమానాశ్రయంలో నిరీక్షింస్తున్నారు. షెడ్యూల్ టైం అయినా విమానం రాలేదు. దీనిపై తిరుపతి ఎయిర్ పోర్టు అధికారుల నుంచి కూడా సమాధానం లేదు. రద్దు చేసిన విషయం ప్రకటన చేయలేదు. సమాచారం కూడా ఇవ్వలేదనేది ప్రయాణికుల ఆరోపణ. తమకు ప్రత్యామ్యాయ ఏర్పాట్లు కూడా చేయలేదని ఆగ్రహించిన 45 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే నిరసనకు దిగారని సమాచారం అందింది. దీనిపై తిరుపతి విమానాశ్రయం అధికారుల నుంచి సరైన సమాధానం కూడా రాలేదు.

విమానం రద్దు అయిన కారణంగా చార్జీలు తిరిగి చెల్లించాలని సంబంధిత విమాన సంస్థ ప్రతినిధిని నిలదీశారు. ఆయన నుంచి సమాధానం లేకపోవడంతో వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంలో విమానాశ్రయం అధికారులు కూడా స్పందించని వాతావరణం ఏర్పడింది.
రేణిగుంట ఎయిర్ పోర్టు 0877 -2275354 నంబర్కు ఫోన్ చేస్తే, డైరెక్టర్ పీఏ గురునాథరెడ్డి 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడారు. "ప్రయాణికుల నిరసన విషయం తెలియదు. విమానసర్వీసు రద్దు విషయం సమాచారం లేదు. కనుక్కుంటా" అని సమాధానం చెప్పారు.
పక్కనే విమానాశ్రయ ఓఎస్డీ ఉన్నారని ఫోన్ అందించారు. "ఇంతకీ సమస్య ఏమిటో చెప్పండి" అనేది ఆయన ప్రశ్న. "ప్రయాకులు నిరసనకు దిగారంట. విమానసర్వీసు రద్దు అయింది వాస్తవమా? ఏమి జరిగింది" అని ప్రశ్నిస్తే, అసలు సమస్య ఏమిటో సూటిగా చెప్పండి అనేది ఆయన నుంచి ఎదురు ప్రశ్న. మళ్లీ వివరిస్తూనే "మీ పేరు ఏమిటి సార్. అని అడిగినా, మీకు అవన్నీ అనవసరం" అని విసురుగా ఫోన్ పెట్టేశారు. ఇది విమానాశ్రయంలో వరస. విమానాశ్రయ డైరెక్టర్ హేమాద్రితో మాట్లాడడానికి అక్కడి అధికారులు అనుమతించే పరిస్థితి లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.
గతంలోనూ
తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణికులు నిరసనలకు దిగడం పరిపాటిగా మారింది.
2024 జనవరి 13 (సోమవారం) తిరుపతి విమానాశ్రయం నుంచి విశాఖపట్టణానికి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరాల్సిన ఇండిగో విమానం రద్దు చేశారు. దీంతో 26 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు నిరసనకు దిగారు. మంగళవారం సాయంత్రం లోపు ఏర్పాట్లు చేస్తామని ఆ విమాన సంస్థ ప్రతినిధులు చెప్పడం, చార్జీలు తిరిగి చెల్లించేందకు అనుమతి లేదనే సమాధానంతో ఆగ్రహం చెందిన సంఘటన చోటుచేసుకుంది. అప్పుడు కారణం ఏమిటంటే "తగినంత మంది ప్రయాణికులు లేకపోవడమే" అని చల్లగా సెలవిచ్చారు. ఇది మచ్చుకు ఓ ఉదాహరణ మాత్రమే.
యాత్రికుల సౌకర్యం కోసం
తిరుమలకు యాత్రకులు రైల్, రోడ్డు మార్గంలోనే కాదు. ఆకాశయానం కూడా చేయడానికి సుముఖత చూపుతున్నారు. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్టణం, చెన్నై నగరాలకు తిరుపతి విమానాశ్రయానికి కనెక్టింగ్ ఫైట్లు ఉన్నాయి.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఆ నగరాల నుంచి విమానాల్లో వచ్చే వారి సంఖ్య మెరుగ్గానే ఉంటోంది. డబ్బుకు వెనుకాడని వారు విమానాల్లో త్వరగా తిరుపతికి చేరుకోవడం ద్వారా తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. దీంతో వారంలో నాలుగు రోజులు 14 విమాన సర్వీసులు, మూడు రోజులు 13 విమాన సర్వీసులు దేశంలోని వివిధ నగరాల మద్య రాకపోకలు సాగిస్తున్నాయి.
అంతేకాకుండా, విమాన సర్వీసులు పొడిగించే దిశగా ముంబై, అహ్మదాబాద్, కోల్ కతా, అలహాబాద్, మధురై, తిరుచ్చి, తిరువనంతపురం విమానాశ్రయాల నుంచి కూడా తిరుపతికి సర్వీసులు నడపడానికి ప్రతిపాదనలు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (Airport Authority Of India) వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ పాటికే కొన్ని సర్వీసులు ఇటీవల ప్రారంభమయ్యాయి. వాటిల్లో డైరెక్ట్ ఫ్లైట్స్ కాకుండా కనెక్టివిటీతో నడపడానికి సమాలోచనలు సాగిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయికి ఎదిగిన తిరుపతి ఏరోడ్రోమ్ లో రన్ వే కూడా రెండేళ్ల కిందటే సిద్ధమైంది. డీజీసీఏ ప్రయాణికుల సంఖ్య పెరిగిన తరువాత నేరుగా విమాన సర్వీసలు ప్రారంబించాలనేది ఆలోచనగా భావిస్తున్నారు.
ఇన్ని చేస్తున్నప్పటికీ విమానయానంలో తిరుమల తరహాలోనే తిరుపతి విమానాశ్రయంలో తిప్పలు పడుతున్నారు. ఇక్కడ ఇవి సర్వసాధారణంగా మారాయి. కొన్ని విమానయాన సంస్థల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. విమానయాన శాఖాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచిచూడాల్సిందే.
Tags:    

Similar News