మంత్రి కొల్లు రవీంద్రకు లైన్‌ క్లియర్.. ఆదేశాలిచ్చిన హైకోర్టు

కొన్ని రోజులుగా పాస్‌పోర్ట్ కోసం తెగ తంటాలు పడుతున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అధికారంలో తమ పార్టీనే ఉన్నప్పటికీ ఆయనకు పాస్‌పోర్ట్ జారీ చేయడానికి అధికారులు నిరాకరించారు.

Update: 2024-09-13 09:59 GMT

కొన్ని రోజులుగా పాస్‌పోర్ట్ కోసం తెగ తంటాలు పడుతున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అధికారంలో తమ పార్టీనే ఉన్నప్పటికీ ఆయనకు పాస్‌పోర్ట్ జారీ చేయడానికి అధికారులు నిరాకరించారు. ఆయనపై పలు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండటంతో పాస్‌పోర్ట్ పొందడంలో ఆయన అనేక చిక్కులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. ఉన్నత న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. మంత్రి కొల్లు రవీంద్ర పాస్‌పోర్ట్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని, క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా ఆయనకు పాస్‌పోర్ట్‌ను జారీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాస్‌పోర్ట్ అధికారులు అలెర్ట్ అయ్యారు. కొల్లు రవీంద్ర పాస్‌పోర్ట్ మంజూరుకు తగిన ఏర్పాట్లు సిద్ధం చేశారు.

పాస్‌పోర్ట్ అందుకే..

సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు అమెరికాకు వెళ్లాల్సి ఉందని, అందుకోసమే పాస్‌పోర్ట్ కోసం ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లగా వాళ్లు నిరాకరించారని కొల్లు రవీంద్ర తరపు న్యాయవాది హైకోర్టు వివరించారు. క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న కారణం చూపుతూ పాస్‌పోర్ట్‌‌ను తిరస్కరించొద్దని సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు అనేక సందర్భాల్లో తీర్పులిచ్చాయన్న అంశాన్ని న్యాయవాది ఎంవీ రమణకుమారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కొల్లు రవీంద్రకు వెంటనే పాస్‌పోర్ట్ జారీ చేసేలా ప్రాంతీయ అధికారికి ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయవాది కోరారు. ఈ కేసు తాజా విచారణ శుక్రవారం జరగ్గా.. ఇందులో కొల్లు రవీంద్రకు సానుకూలంగా ఆదేశాలు వెలువరించింది న్యాయస్థానం.

వెంటనే క్లియర్ చేయండి: హైకోర్టు

మంత్రి పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ‘‘క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా కొల్లు రవీంద్ర పాస్‌పోర్ట్‌ను పునుద్దరించండి. ఈ నెల 20న ఆయన విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో ఆయన పాస్‌పోర్ట్ పనులను వెంటనే క్లియర్ చేయండి. ఆయన తన విదేశీ పర్యటనలో భాగంగా అమెరికాలో జరిగే మైన్ ఎక్స్‌పో కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కావున వీలైనంత త్వరగా ఆయనకు పాస్‌పోర్ట్ మంజూరు చేయండి’’ అని కోర్టు ఆదేశాలిచ్చింది.

Tags:    

Similar News