అమరావతి పనుల పునఃప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పటి నుంచంటే..!

రాజధాని అమరావతి నిర్మాణాన్ని కూటమి ప్రభుతవం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అమరావతి నిర్మాణంపై దృష్టి సారించింది.

Update: 2024-08-24 15:38 GMT

రాజధాని అమరావతి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అమరావతి నిర్మాణంపై దృష్టి సారించింది. అమరావతి పనుల విషయాన్ని పరుగులు పెట్టిస్తూ వస్తోంది. కేంద్రంతో మాట్లాడి.. రాజధాని నిర్మాణం కోసం రూ.15 వేల కోట్ల ఆర్థిక సహాయానికి సహకారాన్ని కూడా ఖరారు చేసుకున్నారు. కానీ అమరావతి పనులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి, అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది అన్నవి మాత్రం ఇన్ని రోజులు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉన్నాయి. కాగా తాజాగా వీటిలో అమరావతి పనుల పునఃప్రారంభంపై పట్టణాభివృద్ధి పొంగూరు నారాయణ క్లారిటీ ఇచ్చారు. విజయవాడలో క్రెడాయ్ ప్రతినిధులతో జరిగిన సమావేశం సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ విషయంపై మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకుంది. అమరావతి పనుల పనఃప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని వెల్లడించారు. మరోసారి ఏపీ రాజధాని అనే అంశం గతంలో తరహాలో జోక్ కాకుండా చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఏపీ రాజధానిని మూడు ముక్కలాట మాదిరిగి మార్చేసిందని, తద్వారా అమరావతి నిర్మాణాన్ని నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టెండన్లను నాశనం చేసింది వైసీపీనే

‘‘2014-19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి పెద్దపీట వేసి పనులను పరుగులు పెట్టించింది. అప్పట్లోనే అమరావతి అభివృద్ధి కోసం రూ.41వేల కోట్లతో టెండర్లు ఇచ్చింది. కానీ 2019లో మారిన ప్రభుత్వం వీటిని అటకెక్కించేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అభివృద్ధే ద్యేయంగా ముందడుగు వేస్తోంది. అమరావతి కోసం తాజాగా రూ.5వేల కోట్లు ఖర్చు చేశాం. రాజధాని ప్రాంతంలో కంపచెట్ల తొలగింపును రూ.36కోట్లతో చేపట్టాం. ఈ తొలగింపు ఇప్పటికే 50శాతం పూర్తయింది’’ అని వెల్లడించారు.

గతంలోనే నాలుగు నర్సరీలు

‘‘గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అమరావతిలో నాలుగు నర్సరీలు ఏర్పాటు చేశాం. వాటిని గత ప్రభుత్వం ఐదేళ్లపాటు పట్టించుకోలేదు. దీంతో వాటి నిండా చెట్లు పెరిగిపోయాయి. తాజాగా రాజధాని ప్రాంతంలో నాలుగు పార్కులు అభివృద్ధి చేస్తున్నాం. వాటిలో శాఖమూరు సెంట్ర పార్కును 300 ఎకరాల్లో, రీజినల్ పార్క్ 35 ఎకరాలు, మర్కాపురం పార్కు 25 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నాం. రెండు వాటర్ లేక్‌లు సైతం అభివృద్ధి చేస్తాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్‌కు రెండు వైపులా బఫర్ జోన్ ఏర్పాటు చేస్తాం. అక్కడ ట్రీ ప్లాంటేషన్ కూడా చేపడతాం’’ అని వివరించారు.

డిసెంబర్‌లోనే పనులు పునఃప్రారంభం

‘‘అమరావతిలో ఇప్పటివరకు చేసిన పనులతో టెండర్లు ఆపేస్తున్నాం. అమరావతి పనులను డిసెంబర్ మొదటి వారం నుంచి పునఃప్రారంభించే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణం ఆగి ఏడేళ్లు పూర్తయ్యాయి. శాఖమూరిలోని అంబేద్కర్ స్మృతి వనం అంశంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడాల్సి ఉంది. ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకున్న వెంటనే పనులను మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఈసారి ఎలాగైనా అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా పూర్తి చేయాలన్నదే లక్ష్యం’’ అని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేవలం సీడ్ క్యాపిటల్ కోసమే రూ.60వేల కోట్ల పెట్టాలన్న ఆలోచన చేస్తున్నట్లు కూడా చెప్పారు.

ఇప్పటివరకు ఉన్న అమరావతి టెండర్లను క్లోజ్ చేస్తున్నామని, మూడు నెలలు వీటిపై అధ్యయనం చేసి కొత్త టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఐఐటీ రిపోర్ట్‌లు వచ్చిన తర్వాత వాటిని కూలంకషంగా పరిశీలించి కమిటీలో చర్చించిన తర్వాత పనులను ప్రారంభిస్తామని నారాయణ స్పష్టం చేశారు. ఇవన్నీ డిసెంబర్ మొదటి వారానికి పూర్తవుతాయని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News