అటవీ ఉత్పత్తులపై ఉన్న ఒప్పందం కాదని మరో ఒప్పందం

అడవుల్లోని ఉత్పత్తులను గిరిజనుల ద్వారా కొనుగోలు చేసేందుకు జీసీసీతో 2027 వరకు అటవీ శాఖతో ఒప్పందం ఉంది. అయితే వేరే సంస్థతో శనివారం మరో ఒప్పందం అటవీ శాఖ చేసుకుంది.

Update: 2024-12-01 09:59 GMT

ఆంధ్రప్రదేశ్ లోని అడవుల్లో ఏ ఉత్పత్తులైనా కొనాలంటే 2027 వరకు గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ మాత్రమే కొనుగోలు చేయాలి. ఆ మేరకు అటవీ శాఖతో గతంలోనే జిసిసి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం మధ్యలో ఎవ్వరూ దూరేందుకు అవకాశం లేదు. అయితే శనివారం మరో సంస్థతో అటవీ శాఖ ప్రిన్స్ పల్ కార్యదర్శి అటవీ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

ఇప్పటి వరకు ఉన్న ఒప్పందం ఏమిటి...

అడవుల్లో గిరిజనులు సేకరించే ఉత్పత్తులు ఎవరైనా కొనుగోలు చేయాలంటే అటవీ శాఖ నుంచి అనుమతి పొంది ఉండాలి. అయితే అవేమీ పట్టించుకోకుండా చాలా మంది ప్రైవేట్ వ్యాపారులు ఇష్టానుసారం అటవీ ఉత్పత్తులు తక్కువ ధరకు గిరిజనుల వద్ద కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ మాత్రం అడ్డాకులు, కొండ చీపుర్లు, అడవి చీపుర్లు, ఉసిరి కాయలు, విత్తనాలు, కొండ తేనె, తేనెటీగల పెంపకంతో తయారైన తేనె, కుసుమ్ ఆయిల్ విత్తనాలు, మైరోబాలన్, మోదుగ పువ్వు, నరమామిడి బెరడు, తేనె మైనం, కొండగోగు, వలియా బానం బంక, మారేడు గడ్డలు, సుగంధ పార వేర్లు, సోయా గింజలు, టెరిపోడ్స్, మారేడు గడ్డలు, సుగంధిపార వంటి 21 రకాల అటవీ ఉత్పత్తులు వేరెవరూ కొనేందుకు వీలు లేకుండా అటవీ శాఖతో ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఉత్పత్తులు వీరే కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ఒప్పందం చేసుకున్న భర్తీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ సంస్థ కొనేందుకు వీలు లేదు. దీనిపై జీసీసీ అధికారులు స్పందిస్తూ చేసిన ఒప్పందం ప్రకారం కాదని వెళితే ఈ విషయాన్ని మా గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ద్వారా ప్రభుత్వం ముందు ఉంచుతామన్నారు.

గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులతో పలు రకాల వస్తువులు

గిరిజన కో ఆపరేటివ్ సొసైటీ ప్రస్తుతం గిరిజనుల నుంచి సేకరిస్తున్న ఉత్పత్తులతో పలు రకాల వస్తువులు తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నది. సబ్బులు, షాంపూలు, కాఫీ పొడి, ఇంకా పలు రకాల వస్తువులు గిరిజన కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా అమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు రకాల ఉత్పత్తులను కో ఆపరేటివ్ సొసైటీ కొనుగోలు నుంచి మినహాయించింది. గమ్, చింతపండు, వహువ విత్తనాలు, కానుక గింజలు గిరిజనులు వారి ఇష్టమొచ్చిన వారికి అమ్ముకోవచ్చు. ఎందుకంటే వీటిపై ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించిన ధరకు తక్కువ కాకుండా ఎక్కువ ధరకు ఎవరైనా కొనుగోలు చేయొచ్చు. అవసరమైతే ఎమ్మెస్పీకి కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.

ప్రస్తుతం జరిగిన ఒప్పందం ఏమిటి...

రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకంలో అరుదైన అటవీ ఉత్పత్తుల గుర్తింపుతో పాటు కార్పొరేట్ స్థాయి మార్కెటింగ్ ద్వారా అడవి బిడ్డల జీవన స్థితిగతులు మెరుగుపర్చేందుకు పటిష్ట ప్రణాళిక రూపు దిద్దుకుంటోంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) ఆధ్వర్యంలోని భర్తీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ సంస్థలు మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ కుదుర్చుకున్నాయి. అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన త్రిసభ్య ఒప్పంద పత్రాలపై ఈ మూడు సంస్థల ప్రతినిధులు సంతకం చేశారు. అటవీ ఉత్పత్తుల నిర్వహణ, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని ముందుకు వెళ్లాల్సిన మార్పులు, గిరిజనుల జీవనశైలి మెరుగు పర్చడం మీద ఈ మూడు సంస్థలు సంయుక్తంగా దృష్టి పెట్టనున్నాయి.

Delete Edit

ఈ ఎంఓయూ ప్రకారం అడవుల్లో దొరికే సహజ సిద్ధమైన సీజనల్ ఉత్పత్తుల గుర్తింపు, సేకరణ, మార్కెటింగ్ మీద ప్రధానంగా దృష్టి సారిస్తారు. పర్యావరణ హితంగా అడవుల సాధారణ స్థితికి ఏ మాత్రం భంగం కలిగించకుండా డిజిటల్, జియోస్పాషియల్ సాంకేతికత ఆధారంగా అరుదుగా దొరికే ఉత్పత్తులను గుర్తిస్తారు. రాష్ట్రంలోని అడవుల్లో దొరికే అద్భుతమైన సంపదను దీనివల్ల గుర్తించడం సులభతరం అవుతుంది. ప్రాజెక్టులో ఆయా ప్రాంతాల్లోని స్థానిక గిరిజనులను భాగస్వామ్యం చేసి ముందుకు వెళ్తారు. ముఖ్యంగా గిరిజన మహిళలను దీనిలో భాగం చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తారు. కలప ఉత్పత్తులను మినహాయించి ఇతర నాణ్యమైన, అరుదైన అటవీ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి మార్కెటింగ్, బ్రాండింగ్ చేయడం మీద దృష్టిపెడతారు.

రాష్ట్ర అటవీ శాఖ PCCF, అండ్ HOFF చిరంజీవ్ చౌదరి మాట్లాడుతూ ‘అటవీ ఆర్థిక ప్రగతికి ఈ ఒప్పందం గేమ్ ఛేంజర్ అవుతుంది. అటవీ ఉత్పత్తుల ద్వారా సంపద సృష్టి భారీగా పెరుగుతుంది. ఇది గిరిపుత్రుల ప్రగతికి దారి చూపుతుంది. 40 శాతం మంది గిరిపుత్రులు అటవీ ఉత్పత్పుల మీద ఆధారపడి నేటికీ జీవనం సాగిస్తున్నారు. వారికి ఈ ఒప్పందం ప్రకారం మేలు జరుగుతుంది. వారి జీవన గతి మెరుగు పడుతుందని’ అన్నారు. ఈ సందర్భంగా భర్తీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఈడీ అశ్వనీ ఛాత్రే మాట్లాడుతూ ‘అటవీ ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయం అడవిని నమ్ముకుని జీవించే గిరిజనులకే దక్కేలా చూడటమే ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా అటవీ ఉత్పత్తుల గుర్తింపు, మార్కెటింగ్ సప్లై ఛైన్ ఏర్పాటు, కొత్త అవకాశాలను సృష్టించడం అనేది ప్రధానం. దీనివల్ల గిరిజనుల జీవితాల్లో కొత్త మార్పులు వస్తాయని అన్నార

Tags:    

Similar News