రెండు రోజుల పాటు ఆంధ్రకు వర్షాలు.. హెచ్చరించిన అధికారులు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు.

Update: 2024-08-15 14:39 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారంతా అప్రమత్తంగా ఉండాలని, పట్టణ ప్రాంతాల్లో ఉండే వారు కూడా ప్రయాణాలు చేసే టప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. భారతదేశ వాతావరణ శాఖ సూచనల మేరకు తాము ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కర్ణాటకలో తుంగభద్ర నుంచి భారీ వరద నీరు వస్తున్న క్రమంలో అధికారులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారాయన.

ఈ క్రమంలోనే రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, నంద్యాల, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఎల్లుండి అంటే శనివారం రోజున.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్ సూచించారు. ఈ సమయంలో సీజనల్ వ్యాధులు విపరీతంగా వచ్చే ప్రమాదం ఉందని, కావున ప్రతి ఒక్కరూ వీలైనంతవరకు వర్షంలో తడవరేండా ఉండటానికి ప్రయత్నించాలని సూచించారు. ఒకవేళ ఏమాత్రం అస్వస్థతగా అనిపించినా వైద్యులను సంప్రదించాలని, రెండు తెలుగు రాష్ట్రాల్లో విష జ్వరాలు ప్రభలుతున్న క్రమంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరమని చెప్పారు. అంతేకాకుండా వర్షం కురిసే సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

Tags:    

Similar News