పెండింగ్ బిల్లులపై ఆరా తీస్తున్న ఆంధ్ర ప్రభుత్వం

గత ప్రభుత్వం పెండింగ్ బిల్లులపై ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఆరా తీస్తోంది. సరైన సమాచారం ఇవ్వాలని అధికారులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు.

Update: 2024-07-02 12:03 GMT

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఎన్నడూ లేని దూకుడు కనబరుస్తోంది. పాలన విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తోంది. అన్ని శాఖల అధికారులతో మంత్రులు వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఈవిషయంలో సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ కూడా మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవకతవకలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అన్న రకాలుగా జరిగిన చెల్లింపులకు సంబంధించిన రికార్డ్‌లను మరోసారి తిరగేయిస్తోంది. ఈ నేపథ్యంలోనే గత ఐదేళ్లలో చెల్లించిన బిల్లులపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. గత ప్రభుత్వం చెల్లించిలు బిల్లుల మొత్తం ఎంత? అవి ఏంటి? ఇంకా పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఏంటి? వాటి మొత్తం ఎంత? అవి దేనికి సంబంధించిన బిల్లులు? అన్న అంశాలపై అధికారులను ఆర్థిక మంత్రిత్వశాఖ ఆరా తీస్తోంది. ఇప్పటివరకు ఈ అంశాలపై అడిగిన ప్రతిసారి అరకొరగానే సమాచారం అందించారని మంత్రిత్వశాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాగా ఇప్పటివరకు కేవలం రూ.10వేల కోట్ల బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని ఆర్థికశాఖ అధికారులు చెప్తున్నారు.

శ్వేత పత్రానికి కసరత్తులు

అయితే గత ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచిన బిల్లులపై శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. అందుకోసమే పెండింగ్ బిల్లులపై మంత్రిత్వశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. అధికారులను ఆఘమేఘాలపై పెండింగ్ బిల్లులకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచింగ్ బిల్లులపై శ్వేతపత్రం ప్రకటించాడిని కూటమి ప్రభత్వం కసరత్తులు చేస్తోంది. అన్ని వివరాలు తెలుసుకోవడానికి శ్రమిస్తోంది. గత ప్రభుత్వం పాల్పడిన అన్ని ఆర్థిక అవకతవకలను తాము బహిర్గతం చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.

మంత్రి ఆగ్రహం

ఇప్పటివరకు ఎన్నిసార్లు అడిగినా పెండింగ్ బిల్లులకు సంబంధించి అధికారులు అరకొరాగానే సమాచారం ఇస్తుండటంపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లుల పూర్తి సమాచారం వెంటనే అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని శాఖలకు లేఖలు రాయాలని కూడా అధికారులను ఆదేశించారు మంత్రి. పెండింగ్ బిల్లులకు సంబంధించిన సమాచారం అందించని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారాయన. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమార్జనను బహిర్గతం చేయాలని సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను ఈ లేఖ రాస్తున్నానని ఆయన చెప్పారు.

ప్రత్యేక చట్టమైనా తేవాలి

‘‘వైసీపీ హయాంలో భారీగా అక్రమార్జన జరిగింది. ఆ మొత్తాన్ని బహిర్గం చేయడానికి, తిరిగా ఆ మొత్తాన్ని రాబట్టడానికి రెవెన్యూ రికవరీ చట్టం లేదా ప్రత్యేక చట్టాన్నైనా వినియోగించాలి. ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక నష్టాన్ని అధిగమించడానికి ఈ ప్రభుత్వం చేపట్టిన పురోగతి చర్యలు అభినందనీయం. ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో నూతన ప్రభుత్వానికి కొన్ని సూచనలు. ఈ సూచనలు ఎన్నికల మ్యానిఫెస్టో అమలుతో పాటు రాష్ట్ర ఖజానా, ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి’’ అని వివరించారు.

అవినీతిని ప్రబలంగా నిర్మూలించాలి

‘‘పన్ను ఆదాయాలను క్రమబద్ధీకరించడం, సహేతుకమైన స్థిర రుణాలు, ఇప్పుడు ఉన్నదాని కంటే ఎక్కువ గ్రాంట్-ఇన్-ఎయిడ్ తదితర అంశాలపై కేంద్రాన్ని అభ్యర్థించాలి. వేస్ అండ్ మీన్స్, ఓడీని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఆదాయ వ్యయాలు తగ్గించుకోవాలి. సంక్షేమ పథకాలను అర్హులే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లాలి. మూలధన వ్యయంలో లీకేజీలను అరికట్టాలి. ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక గమ్యస్థానంగా మార్చాలి. సమృద్ధిగా ఆదాయాన్ని అందించే సహజ వనరులను రక్షించాలి. ఎస్ఆర్బీఎం చట్టంలో ఉన్న ఆర్థిక క్రమశిక్షణ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించడం ద్వారా లోటు ప్రస్తుతం నియంత్రించి.. రాబోయే సంవత్సరాల్లో తగ్గించాలి. బిల్లుల చెల్లింపులు సీఎఫ్ఎంఎస్ ద్వారా మాత్రమే చేయాలన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పురోగతి, శ్రేయస్సు కోసం అనుకూల వాతావరణాన్ని వేగవంతం చేసేందుకు ప్రబలంగా ఉన్న అవినీతిని నిర్మూలించాలి. చంద్రబాబు దార్శనిక నాయకత్వం, సుపరిపాలన పట్ల నిబద్ధతతో రాష్ట్రం సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధిస్తుంది’’ అని యనమల ఆకాంక్షించారు.

Tags:    

Similar News