జగన్ అజ్ఞానానికి నిదర్శనం.. మరోసారి ఫైర్ అయిన షర్మిల

రాష్ట్రంలో పతకాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రారంభించింది. విద్యా వ్యవస్థల్లో అందించే పథకాలపైనే ఈసారి దృష్టి సారిస్తున్నాని అంటోంది ప్రభుత్వం.

Update: 2024-07-28 09:40 GMT

డిప్యూటీ సీఎం పవన్ కల నెరవేరింది. డొక్కా సీతమ్మ పథకం వచ్చేసింది. గతంలో అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా పెట్టాలని, ప్రభుత్వ పథకాలకు డొక్కా సీతమ్మ వంటి మహనీయుల పేర్లను పెట్టాలని జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించాయి. అప్పటి నుంచి డొక్కా సీతమ్మ పేరు పెనమోగిపోయింది. అంతవరకు ఆమె చేసిన మంచి కొద్దిమందికే తెలిసినప్పికీ.. పవన్ కల్యాణ్ అంత పర్టిక్యూలర్‌గా డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఉండాలని కోరడంతో అసలు ఆమె ఎవరు అని వెతికిన వారంతా ఆమె గురించి వాస్తవాలు తెలుసుకుని ఇంతటి మహానుభావురాలా అని అనుకున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వే ఉంది. కూటమి అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతున్నా డొక్కా సీతమ్మ పథకం గురించి ఊసేలేదు. ఎన్నో పథకాల పేర్లను మార్చిన చంద్రబాబు సర్కార్.. దీనిని మాత్రం మరిచిందని అనుకున్నారు. కానీ ఈ విషయంలో పవన్ కల్యాణ్ కోరిక తాజాగా నెరవేరింది.

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు పది పథకాల పేర్లను చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం మార్చింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, విద్యాదేవెన, విద్యోన్నతి పథకాలతో మొదలైన ఈ మార్పు కాస్తంత గ్యాప్ తీసుకుని మళ్ళీ మొదలైంది. తాజాగా మరో ఆరు పథకాల పేర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ విడత పథకాల పేర్ల మార్పులో అన్ని పథకాలు కూడా విద్యావ్యవస్థకు సంబంధించిన పథకాలే కావడం గమనార్హం. ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉందని లోకేష్ వివరించారు.

పేర్ల మార్పు లక్ష్యం అదే

విద్యార్థులకు అందిస్తున్న అనేక పథకాలకు సంబంధించి పేర్లను మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అందుకే ఈ పథకాల కొత్త పేర్లకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేకుండా చర్యలు తీసుకున్నామని, విద్యార్థులకు అందించే పథకాలు వారికి సంబంధించినవే అయి ఉంటాయని వివరించారు. విద్యను రాజకీయాలకు అతీతంగా మార్చాలన్న ఉద్దేశంతో ఈ మార్పుకు తెరలేపడం జరిగింది తప్ప గత ప్రభుత్వంపై కక్షకార్పణ్యాలు లేవని, కక్ష సాధింపు రాజకీయాలు కూటమి స్టైల్ కాదని కూడా లోకేష్ పేర్కొన్నారు.

 

పేర్లు మారిన పథకాలివే..

2019లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన వైసీసీ ప్రభుత్వం.. ఎన్నో పథకాలను అమలు చేసింది. వాటన్నింటితో పాటు, అప్పటికే అమలవుతున్న కొన్ని పథకాల(ఎన్‌టీఆర్ పేరు కలిసి ఉండే పథకాలు) పేర్లను వైఎస్ఆర్, వైఎస్ కలిసి వచ్చేలా మార్చింది. అందుకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, విద్యాదీవెన, జగనన్న అమ్మ ఒడి వంటివి మచ్చుక్కు కొన్ని. వీటిలో విద్యకు సంబందించిన పథకాలపేర్లను కూటమి సర్కార్ మార్చింది. జగనన్న అమ్మ ఒడి పథకం పేరును తల్లికి వందనంగా మార్చినట్లు అధికారికంగా ప్రకటించింది. దాంతో పాటుగా..

జగనన్న విద్యా కానుక - సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర

జగనన్న గోరుముద్ద - డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం

మన బది నాడు-నేడు - మన బడి-మన భవిష్యత్తు

స్వేచ్ఛ - బాలిక రక్ష

జగనన్న ఆణిముత్యాలు - అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం

పథకాలకు స్ఫూర్తిదాతల పేర్లను పెట్టడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు, నారా లోకేష్‌కు కృతజ్ఞతలు కూడా తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. అందులో పలు కీలక వ్యాఖ్యలు చేవారు పవన్ కల్యాణ్.

‘‘భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు అభినందనలు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకొన్నారు. ఆ దుస్సంప్రదాయానికి మంగళంపాడి – విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించే వారి పేర్లతో పథకాలు అమలు మంచి పరిణామం.

పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ లాంటివి ఇస్తున్నారు. ఈ పథకాన్ని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితం. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, 2వ రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గ నిర్దేశనం చేస్తుంది.

మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు. ఇందుకు భిన్నంగా- ‘అపర అన్నపూర్ణ’ డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలి. ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నంపెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ. వారి దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడుతాయి.

మన దేశపు మిస్సైల్ మ్యాన్ డా.అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది. పేద కుటుంబంలో పుట్టిన కలాం గారు ఎన్నో ఆటుపోట్ల నడుమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకొన్నారు. తదనంతరం రాష్ట్రపతిగా ఆదర్శవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. కలాం గారి జీవన ప్రస్థానం నవతరంలో స్ఫూర్తిని కలిగిస్తుంది. మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకొంటారు. ఆ మహనీయుల దివ్యాశ్సీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయి’’ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News