మిథున్ రెడ్డి పిటీషన్ ను డిస్మిస్ చేసి ఏపీ హైకోర్టు

మద్యం కుంభకోణం వ్యవహారంలో మిథున్‌రెడ్డిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.;

Update: 2025-04-03 14:06 GMT

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నాయకుడు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో చుక్కెదురైంది. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటీషన్‌ మీద గురువారం విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆ బెయిల్‌ పిటీషన్‌ను కొట్టివేసింది.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం హయాంలో భారీ ఎత్తున మద్యం కుంభకోణం జరిగిందని, దీనిలో ఎంపీ మిథున్‌రెడ్డికి కూడా ప్రమేయం ఉందనే ఆరోపణలో ఎంపీ మిథున్‌రెడ్డి మీద సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం విక్రయాలు, తయారీలోను పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయని, ఈ అక్రమాలలో ఎంపీ మిథున్‌రెడ్డి ప్రమేయం కూడా ఉందంటూ గతేడాది నవంబరులో సీఐడీ పోలీసులు మిథున్‌రెడ్డి మీద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తనను సీఐడీ పోలీసులు అరెస్టు చేస్తారేమో అని భావించిన మిథున్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీని మీద గత నెల మార్చి 24న హైకోర్టులో వాదనలు జరిగాయి. అయితే తీర్పును రిజర్వు చేశారు. మార్చిన 3న వెలువరిస్తామని, అప్పటి వరకు మిథున్‌రెడ్డిని అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింద.
ఈ నేపథ్యంలో తాజాగా గురువారం ఈ పిటీషన్‌ మీద ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విచారణ చేపట్టింది. మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పత్రికలు, మీడియలో వస్తున్న వార్తలు, కథనాలను ఆధారంగా చూపుతూ ముందస్తు బెయిల్‌ కోరడం సరికాదని, ఈ కేసులో పిటీషనర్‌ను నిందితుడిగా చేర్చలేదని, పిటీషనర్‌కు నోటీసులు కూడా ఇవ్వలేదని, ఈ దశలో ముందస్తు బెయిల్‌ ఇవ్వడం సరికాదని, ఈ నేపథ్యంలో పిటీషన్‌ను కొట్టివేయాలని సీఐడీ తరపున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేనప్పుడు బెయిల్‌ కోరడానికి వీల్లేదని వివరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.


Tags:    

Similar News