Intestinal ligation | కువైట్ నుంచి వచ్చి కొడుకును కడతేర్చి..

దురలవాట్లతో దారి తప్పిన కొడుకు తల్లిపై అభాండాలు వేశాడు. భరించలేని తల్లిదండ్రులే అతనిని కాటికి పంపారు.;

Update: 2025-01-17 07:39 GMT

గల్ఫ్ దేశాలు కొందరికి జీవనోపాధి కల్పిస్తున్నాయి. దశాబ్దాల కాలంగా కడప జిల్లా నుంచి అరబ్బు దేశాలకు వెళ్లిన అనేక కుటుంబాలు బతుకు బండి లాగిస్తున్నాయి. తల్లి లేదా తండ్రి ఆ దేశాలకు వెళ్లి, అష్టకష్టాలు పడుతున్నారు. కుటుంబ బాగు కోసం శ్రమిస్తున్నారు. రాజంపేట పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేకమంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. కొన్ని కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతుంటే, ఇంకొన్ని కుటుంబాల్లో విషాదం కూడా చోటు చేసుకుంటోంది. దూర తీరాల్లోని కుటుంబీకుల శ్రమకు అర్థం, పరమార్థం లేకుండా చేస్తున్నారు. ఆ కోవలో..

కడప జిల్లా రాజంపేటలో మరో సంఘటన ఇది. చెడు అలవాట్లతో ఓ యువకుడు దారి తప్పాడు. తల్లి అనే విచక్షణ లేకుండా దుష్ప్రచారం చేశాడు. భరించలేని ఆ తల్లి సమాచారం అందించింది. కువైట్ నుంచి స్వగ్రామానికి తండ్రి తిరిగి వచ్చాడు. చెప్పిన మాట వినని కొడుకును వారిద్దరే అంతం చేసి, కటకటాల పాలయ్యారు.
కడప జిల్లాలోని చాలా కుటుంబాలు ఉపాధి కోసం వెళ్లాయి. అందులో రాజంపేట మండలం పోలి గ్రామానికి చెందిన గౌనిపురి లక్ష్మినరసరాజు ఒకరు. ఈయనకు ఇద్దరు కొడుకులు. వారిలో పెద్ద కొడుకు చరణ్ కుమార్ రాజు (19) పోలి గ్రామంలో తల్లి లలితమ్మ వద్దే ఉంటున్నాడు. రాజంపేట పట్టణంలో బైక్ షోరూమ్ లో పని చేస్తున్నాడు. కువైట్లో ఉన్న లక్ష్మీ నరసరాజు పనిచేసి, పంపిస్తున్న డబ్బుతో కుటుంబం గడుస్తోంది. కాగా,
చరణ్ కుమార్ రాజు మత్తు పదార్థాలకు బానిస అయ్యాడు. తల్లితో రోజు గొడవ పడేవాడు. ఎన్నిసార్లు మందలించిన చరణ్ పద్ధతి మారలేదు. దీనికి తోడు కన్నతల్లి పైనే దుష్ప్రచారం చేయడం ప్రారంభించాడు. మద్యం మత్తులో గ్రామస్తుల ముందే అసభ్యంగా దూషించాడు. దీన్ని భరించలేని లలితమ్మ కువైట్ లో ఉన్న భర్త లక్ష్మీ నరసరాజుకు సమాచారం అందించింది. ఇక గత్యంతరం లేదని భావించి..
కువైట్ నుంచి వచ్చి..
జనవరి 11వ తేదీ కువైట్ నుంచి లక్ష్మీ నరసరాజు రాజంపేట సమీపంలోని సొంత ఊరు పోలి గ్రామానికి చేరుకున్నాడు. దారి తప్పిన కొడుకు చరణ్ కుమార్ రాజుకు అన్ని విధాల నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశారు. అయినా కొడుకు పద్ధతి మారలేదు. ఇక దారికి వచ్చేలా లేడని భావించిన లక్ష్మినరసరాజు భార్యతో కలిసి ఓ పథకం వేశారు. సోమవారం రాత్రి పూటుగా మద్యం మత్తులో వచ్చిన చరణ్ కుమార్ తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. ఎంత చెప్పిన కొడుకు చరణ్ వినయ్ స్థితిలో లేడని లక్ష్మి నరసరాజు దంపతులు విసిగి చేజారిపోయారు. భరించలేని స్థితిలో కన్న కొడుకు అనే విచక్షణ మరిచిన ఆ దంపతులు మనసు రాయిగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.
ముందస్తు పథకం అమలు
దారి తప్పిన కొడుకు చరణ్ రాజును గాడిలో పెట్టాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడం. గ్రామంలో ఎదురవుతున్న అవమానాలు భరించలేని స్థితిలో లక్ష్మి నరసరాజు దంపతులు విచక్షణ కోల్పోయారనే విషయం జరిగిన సంఘటన చెబుతోంది. ముందుగానే వేసుకున్న పథకంతో కొడుకు చరణ్ కాళ్ళు టవల్ తో కట్టేసి, మరో టవల్ గొంతుకు బిగించి తుద ముట్టించారు. మరుసటి రోజు అంటే మంగళవారం కొడుకు అనారోగ్యంతో మరణించినట్లు గ్రామస్తులను నమ్మించేందుకు లక్ష్మీనరసరాజు దంపతులు ప్రయత్నించారు.
పోలీసుల రంగప్రవేశం
గ్రామస్తుల నుంచి ఈ సంఘటన సమాచారం అందుకున్న రాజంపేట రూరల్ పోలీసులు పోలి గ్రామానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత లక్ష్మి నరసరాజు ఆయన భార్యను అదుపులోకి తీసుకున్న సీఐ మహమూద్ అలీ విచారణ చేశారు. దీంతో, కొడుకును తామే హత్య చేసినట్లు పోలీసుల ముందు లక్ష్మీనరసరాజు దంపతులు అంగీకరించారు. గురువారం వారిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు రాజంపేట రూరల్ ( మన్నూరు) సీఐ మహమూద్ అలీ మీడియాకు వెల్లడించారు. కాగా రాజంపేట మండలం హెచ్. చర్లపల్లిలో ఉన్న చరణ్ కుమార్ రాజు తాత వెంకట నరసరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మన్నూరు సీఐ వివరించారు.
Tags:    

Similar News