తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. రూ.5వేల కోట్ల కేటాయింపు

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రైల్వేస్‌కు రూ.5,336 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

Update: 2024-07-24 14:23 GMT

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రైల్వేస్‌కు రూ.5,336 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థను బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రైల్వే ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుడుతున్నామని ఆయన వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల రైల్వే శాఖలకు కేటాయించిన బడ్జెట్‌ను ఆయన ఈరోజు ఢిల్లీలో వివరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రా రైల్వే శాఖ ఆధునికీకరణకు కొత్త ప్రాజెక్ట్‌లను రూపొందిస్తున్నట్లు కూడా తెలిపారు.

తెలంగాణకు కేటాయింపులు

ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రైల్వేకు కూడా కేంద్రం భారీగా కేటాయింపులు చేసింది. దాదాపు రూ.5,336 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. యూపీఏ హయాంతో పోలిస్తే ఇది 6రెట్లు ఎక్కవని తెలిపారు. ‘‘తెలంగాణలో ప్రస్తుతం రూ.32,946 కోట్ల ప్రాజెక్టులు జరుగుతన్నాయి. అమృత్ పథకంలో భాగంగా 40 రైల్వేస్టేషన్లు ఆధునికీకరించాం. తెలంగాణలో కూడా వందశాతం విద్యుదీకరణ పూర్తయింది. గడిచిన 10ఏళ్లలో 437 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం పూర్తయింది. దేశంలో రూ.1.9లక్సల కోట్లతో రైల్వే సేఫ్టీ కోసం కేటాయింపులు చేశాం. రైల్వే ప్రమాదాలు యూపీఏ హయాంతో పోలిస్తే తమ ప్రభుత్వంలో 60శాతం తగ్గాయి’’ అని వివరించారాయ.

అమరావతికి రైల్వే లైన్

దక్షిణ కోస్ట్ రైల్వే జోన్ నిర్మాణం కోసం చర్యలు చేపడుతున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతంలో ఈ రైల్వే జోన్ కోసం కేటాయించిన భూమికి బ్యాక్ వాటర్ సమస్య ఉందని తెలిపారు. ‘‘ఈ ప్రాజెక్ట్‌కు రాష్ట్రప్రభుత్వం కొత్త భూమిని కేటాయించిన అనంతరం నిర్మాణం ప్రారంభం అవుతుంది. విజయవాడ ఏరుపాలెం నుంచి అమరావతికి కృష్ణానది మీదుగా రూ.2,047 కోట్లతో 56 కిమీ మేర రైల్వే లైన్ నిర్మాణం చేపడతాం. అమరావతి రైల్వే లైన్ డీపీఆర్‌కు నీతి అయోగ్ అనుమతి లభించింది. ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కాస్త సమయం పడుతుంది’’ అని వెల్లడించారు. అదే విధంగా విజయవాడ నుంచి ముంబైకు వందేభారత్ రైలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కూడా ప్రకటించారు.

Tags:    

Similar News