చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ.. సీఎం డిమాండ్ ఇదే..

ఏపీని ముంచెత్తిన వరదల కారణంగా తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. వీటిని పరిశీలించడానికి కేంద్రం నుంచి ఒక బృందం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంది.

Update: 2024-09-12 14:24 GMT

ఏపీని ముంచెత్తిన వరదల కారణంగా తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. వీటిని పరిశీలించడానికి కేంద్రం నుంచి ఒక బృందం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంది. ఈరోజు ఉదయం నుంచి ఈ బృందం పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ వాటిల్లిన పంట నష్టం, ఆస్తి నష్టాన్ని సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ, మంగళగిరి, ఎన్‌టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, బాపట్ల, గుంటూరు వరద ప్రాంతాల్లో పర్యటించింది ఈ బృందం. ప్రకాశం బ్యారేజీని కూడా పరిశీలించి అక్కడ సంభవించిన బోట్ల ప్రమాదంపై కూడా కేంద్ర బృందం ఆరా తీసింది. తమ పర్యటనలను ముగించుకున్న అనంతరం గురువారం సాయంత్రం కేంద్ర బృందం.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయింది. సెక్రటరేయట్‌లో జరిగిన ఈ భేటీలో రెండు వర్గాల మధ్య కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వరద నష్టంపై తాము చేపడుతున్న ఎన్యూమరేషన్ గురించి సీఎం చంద్రబాబుు వివరించింది కేంద్ర బృందం.

జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీఎం

ఈ చర్యలో భాగంగానే ఏపీలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. పంట నష్టంతో పాటు భారీ మొత్తంలో ఆస్తి నష్టం జరిగిందని కూడా చంద్రబాబు వివరించారు. భారీ వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేశాయని, విజయవాడ సిటీలో దాదాపు 400 గ్రామాలు తీవ్రంగా నష్టపోగా, ప్రస్తుతం కూడా విజయవాడలో తీవ్ర పరిస్థితులు ఉన్నాయని, ఉత్తరాంధ్రలో కూడా వరదల కారణంగా 100కు పైగా గ్రామాలు నీట మునిగాయని చంద్రబాబు చెప్పారు. ఈ వరదల విపత్తు నుంచి బయటపడటానికి ఏపీకి కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని, అదే విధంగా వరదల కారణంగా నష్టపోయిన వారికి పరిహారం అందించడానికి కూడా నిధులు ఇవ్వాలని చంద్రబాబు కోరారు.

ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలి: షర్మిల

‘‘భారీ వర్షాల కారణంగా ఏలేరు రిజర్వాయర్‌కు వరద పెరగడంతో కిందనున్న వందలాది ఎకరాలు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు రూ.30వేల పెట్టుబడి పెట్టి నష్టపోయారు. దాదాపు 6లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు గారు చెప్పారు. కావున నష్టపోయిన ప్రతి రైతుకు కనీసం రూ.20-25వేలు ఇవ్వాలి. వైఎస్ఆర్ ఏలేరు రిజర్వాయర్‌ ఆధునీకకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మరణానంతరం తర్వాత పనిచేసిన సీఎంలు దీనిని పట్టించుకోలేదు. మెయింటెనెన్స్ చేయలేదు. దీంతో పొలాలు నీటమునిగి రైతులు రోడ్డున పడ్డారు. వెంటనే నష్టపోయిన ప్రతి రైతుకు రూ.25వేలు పరిహారం ఇవ్వడంతో పాటు ఏలేరు, మిగిలిన ప్రాజెక్టుల మెయింటెనెన్స్, కాలువల పూడికతీత పనులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం’’ అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు.

Tags:    

Similar News