అమిత్ షాకి చంద్రబాబు ఫోన్, మీరు గ్రేట్ సర్ అని ప్రశంస

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ కూటమి ఘన విజయం సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

Update: 2024-11-23 10:08 GMT
CHANDRABABU & AMIT SHA
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ కూటమి ఘన విజయం సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విజయపథంలో పయనిస్తున్న మహాయుతి కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమి తరఫున జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ ప్రచారం చేసి వచ్చారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కూడా ప్రచారానికి వెళ్లాల్సి ఉన్నా ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆకస్మిక మృతితో వెళ్లలేదు.
ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడ్డాయి. ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయపథంలో ఉంది. ఈ విజయం అపూర్వమన్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు కూడా చంద్రబాబు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
ఎన్నికల్లో ప్రజలు అపూర్వ విజయం కట్టబెడుతున్నారంటూ శుభాకాంక్షలు చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి భారీ విజయం దిశగా వెళ్తోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం ఆ కూటమి 215 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంవీఏ కూటమి కేవలం 60 స్థానాల్లోనే ముందంజలో ఉంది. మహాయుతి కూటమి అధికారంలోకి రావడం ఖాయం కావడంతో చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ముఖాముఖి..
ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ- కాంగ్రెస్‌ 76 సీట్లలో ముఖాముఖి తలపడ్డాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 44 సీట్లను గెలుచుకోగా.. ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. మహారాష్ట్ర రాజకీయాల్లో 11 జిల్లాలున్న విదర్భలో ఎవరు గెలిస్తే వాళ్లే అధికారానికి దగ్గరవుతారు. ఇక్కడ 62 స్థానాలున్నాయి. ఈసారి కాంగ్రెస్ నాయకత్వంలోని మహావికాస్‌ అఘాఢీకి ఈ ప్రాంతంలో బాగా సీట్లు తగ్గాయి. బీజేపీ బాగా పుంజుకుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో 10 మంది ఎంపీలను దక్కించుకున్న కాంగ్రెస్ కూటమి ఈ ఎన్నికల్లో బాగా వెనుకబడింది. ముఖాముఖి తలపడ్డ స్థానాల్లో దాదాపు 40 సీట్లలో మహాయుతి విజయం సాధించింది. విదర్భ ప్రాంతంలోని నాగ్‌పుర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం ఉంది. ఆ సంస్థ ప్రభావం అక్కడా, ఆ చుట్టుపక్కల ప్రాంతాలపై బలంగా పనిచేసింది.
మొత్తం మీద మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ బాగా లాభపడింది. ఈసారి సీఎం పీఠాన్ని దేవేంద్ర ఫడణవీస్ కు దక్కే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News