చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసు విచారణ వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. నాటి ఏపీ సీఐడీ దీనిని సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటీషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. పిటీషనర్ తపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి వర్చువల్ విధానంలో తన వాదనలు వినిపించారు. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ తాము దాఖలు చేసిన పిటీషన్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తాను ఢిల్లీలో నేనని, విచారణకు స్వయంగా వచ్చి కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని ముకుల్ రోహత్గి కోర్టును కోరారు. దీంతో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో నాటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం చంద్రబాబు నాయుడుకు నాడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీఐడీ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. పిటీషనర్ తరపున ప్రముఖ న్యాయవాది సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.