విద్యా శాఖ తీసుకుంటానంటే సీఎం చంద్రబాబు ఆశ్చర్య పోయారు
దేవుడు ప్రతి ఒక్కరి పరీక్ష పెడుతాడు. ఆ పరీక్ష జయించేందుకు శక్తి కూడా దేవుడు ఇస్తాడు.;
ఏ శాఖ తీసుకోవాలని అనుకుంటున్నావు.. ఏ శాఖపైన ఇంట్రెస్టు ఉంది..అని సీఎం చంద్రబాబు నన్ను అడిగారు. అందుకు విద్యా శాఖను తీసుకోవలనుకుంటున్నాను. నన్ను విద్యా శాఖ మంత్రిని చేయాలని సీఎంను కోరాను. అప్పుడు సీఎం చంద్రబాబు ఆశ్చర్య పోయారు. విద్యా శాఖ చాలా కష్టమైంది. ఎందుకు అంత కష్టమైన విద్యా శాఖ నీకు. చాలా రిస్క్‌తో కూడుకున్నది. అని సీఎం చంద్రబాబు అన్నారు. విద్యా శాఖ పరిధిలో చాలా సంఘాలు ఉంటాయి. లక్షల సంఖ్యలో విద్యార్థులు ఉంటారు. సమస్యలు చాలా ఉంటాయి. ఇంత సంక్లిష్టమైన విద్యా శాఖలో మార్పులు తీసుకొని రావాలంటే ఐదు సంవత్సరాలు సరిపోవు. కనీసం పదేళ్లు పడుతుంది. అని సీఎం చంద్రబాబు అన్నారు. అంటూ తాను విద్యా శాఖను ఎంచుకున్నప్పుడు జరిగిన చర్చ గురించి మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన మిత్రులు, శ్రేయోభిలాషులు కూడా విద్యా శాఖ వద్దన్నారని చెప్పారు. ఐటీ శాఖ అయితే ఈజీగా ఉంటుంది. సూటు బూట్లు వేసుకున్న వాళ్లతో మాట్లాడొచ్చు. ఇంత కష్టం ఎందుకని వారు వారించారని చెప్పారు. అయితే ఆ సమయంలో వారికి ఇలా చెప్పాను. బయట అందరూ అనుకుంటారు..లోకేష్ అనే వ్యక్తి అన్న గారి మనవడు, బాబు గారి కొడుకు.. ఈజీ లైఫ్ అని. కానీ నేను ఒక్కటే చెప్పా. టీడీపీ ఎప్పుడూ గెలవని నియోజక వర్గం నుంచి గెలిచా. మంగళగిరి నియోజక వర్గం 1985లో టీడీపీ గెలిచింది. తర్వాత ఇంత వరకు గెలవ లేదు. అలాంటి మంగళగిరిలో పోటీ చేశాను. 2019లో ఓడి పోయాను. కానీ పట్టుదలతో ఐదేళ్లు కష్టపడి 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే థర్డ్ హైయ్యస్ట్ మెజారిటీ సాధించా.
ఇది ఎందుకు చెబుతున్నానంటే..అని చెబుతూ.. జీవితం అనేది పరీక్ష లాంటిది. దేవుడు ఒక్కోక్కరికి ఒక్కో పరీక్ష పెడుతాడు. ఆ పరీక్షని జయించే శక్తి కూడా మనకు దేవుడిస్తాడు. ఈ మధ్యన చూస్తుంటే ఒక పరీక్షలో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది మంచిది కాదు. పరీక్ష ఫెయిలనంత మాత్రం చినిపోవాలనుకోవడం మంచిది కాదు. సప్లమెంటరీలు రాసుకోవచ్చు. పరీక్షలు పాస్ కావచ్చు. జీవితాన్ని ఒక పరీక్షగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇంటర్ పరీక్షల్లో ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించిన రోజు తాను మంచి పని చేశానని అనుకుంటాను. నా కష్టం ఫలించిందనుకుంటాను. అప్పుడే సంతృప్తి చెందుతాను. అప్పుడే కాలర్ ఎగరేసుకొని తిరుగుతాను అని తాను విద్యా శాఖను తీసుకున్న వెనుక రహస్యాన్ని చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేష్. శనివారం విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చారు.