చిలకలూరిపేట వైఎస్‌ఆర్‌సీపీలో రచ్చ రాజకీయాలు

చిలకలూరిపేట వైఎస్‌ఆర్‌సీపీ రాజకీయాలు రచ్చకెక్కాయి. రాజేష్‌ నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. కొత్త అభ్యర్థి తెరపైకి రావడంతో ఇవి ముదిరి పాకాన పడ్డాయి.;

Byline :  The Federal
Update: 2024-03-13 12:06 GMT
Kavati Manohar Naidu

జి. విజయ కుమార్ 

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎంపిక రచ్చ రాజకీయాలకు దారి తీసింది. మల్లెల రాజేష్‌ నాయుడును చిలకలూరిపేట సమన్వయ కర్తగా వైఎస్‌ఆర్‌సీపీ రెండు నెలల క్రితం నియమించింది. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేస్తున్న విడుదల రజిని చిలకలూరిపేట నుంచే గత ఎన్నికల్లో గెలుపొందారు. ఆమె గెలుపు కోసం రాజేష్‌ నాయుడు బాగా పని చేశారని వైఎస్‌ఆర్‌సీపీ వర్గాలు చెప్పుకుంటుంటాయి. రజనీ ద్వారా చేసిన ప్రయత్నం ఫలించి రాజేష్‌ నాయుడుకి టికెట్‌ అందరూ భావించారు. అయితే ఉన్నట్టుండి అభ్యర్థి మార్పు చిలకలూరిపేట రాజకీయాల్లో కల్లోలం సృష్టించింది.
మనోహర్‌ నాయుడు ఎలా తెరపైకి వచ్చారు?
గుంటూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా ఉన్న కావటి మనోహర్‌ నాయుడు టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. గుంటూరు 2 అసెంబ్లీ నియోజక వర్గానికి విడుదల రజని ఇన్‌చార్జీగా వెళ్లడంతో ఇటీవల కొన్ని సభలు సమావేశాల్లో కలిసి పాల్గొన్నారు. రజనీ మంత్రిగా ఉన్నందు వల్ల ఆమె పరపతిని ఉపయోగించుకుని సిఎం వద్ద మనోహర్‌నాయుడు తనకు ఎమ్మెల్యే సీటు కావాలనే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. దీంతో చిలకలూరిపేట ఇన్‌చార్జీగా నియమించిన రాజేష్‌ నాయుడుని తప్పించి మనోహర్‌ నాయుడుకి అవకాశం కల్పిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది.
ఈ ప్రకటనకు ముందే మల్లెల రాజేష్‌ నాయుడు చిలకలూరిపేటలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో బగ్గుమన్నారు. గుంటూరు నుంచి తెస్తారో, విజయవాడ నుంచి తెస్తారో మాకు అనవసరం. మాకు కావలసింది మర్రి రాజశేఖర్‌. ఆయనకు సీటు ఇస్తే నేను రూ. 20 కోట్లు అయినా ఖర్చు పెట్టుకోవడానికైనా సిద్ధం అంటూ మంత్రి రజనీపై విమర్శలు గుప్పించారు.
మనోహర్‌ నాయుడుకి వ్యతిరేకంగా మరో వర్గం
చిలకలూరిపేటలో నియోజక వర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయ కర్తగా నియమితుడైన మనోహర్‌ నాయుడుకి వ్యతిరేకంగా మరో వర్గం తయారైంది. తనను తప్పించి మరొకరికి సీటు ఇచ్చారని మల్లెల రాజేష్‌ నాయుడు అంటూ మర్రి రాజÔóఖర్‌కు సీటు ఇస్తారనుకుంటే అధి కూడా జరగలేదని, తమ వర్గం రాజేష్‌ నాయుడుని సమర్థించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. దీంతో వైఎస్‌సీపీ చిలకలూరిపేట నియోజక వర్గంలో రెండు వర్గాలు గా విడిపోయింది. మరి మంత్రి అనుచరులంతా ఎవరి వైపు ఉంటారనేది అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు పార్టీలో ఎలాంటి వర్గాలు లేకుండా మల్లెల రాజేష్‌ నాయుడుతోనే కలిసి నడిచారు. ఈ వర్గ రాజకీయాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయోనని వైఎస్‌ఆర్‌సీపీ అధినేతల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Tags:    

Similar News