ఏపీలో చెత్త పన్ను రద్దు.. ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఇక నుంచి ఆంద్రప్రదేశ్‌లో చెత్త పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. గత జగన్‌ ప్రభుత్వం దీనిని అమల్లోకి తెచ్చింది.

Update: 2024-10-02 08:18 GMT

ఆంధ్రప్రదేశ్‌లో చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నేటి నుంచి చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా చెత్త పన్నును వసూలు చేయరాదని ఆయన అధికారులను ఆదేశించారు. తాము అధికారంలోకి వస్తే చెత్త పన్నును రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం మచిలీపట్నంలో పర్యటన చేపట్టారు. అక్కడ నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్త పన్నును రద్దు చస్తున్నట్లు చెప్పారు.

అహింసా సిద్ధాంతంతో గాంధీ ముందుకెళ్లారని అన్నారు. బానిసత్వం వద్దు.. స్వాతంత్య్రమే ముద్దు అని గాంధీ నినదించారని చెప్పారు. నీతి ఆయోగ్‌లో స్వచ్ఛభారత్‌పై ఏర్పాటు చేసిన ఉప సంఘానికి తాను చైర్మన్‌గా ఉన్నానని, చెత్త నుంచి సంపద సృషించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని, రెండు లక్షలకు పైగా వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించి, ఆంధ్రప్రదేశ్‌ను ఓడీఎఫ్‌ ర్రాష్టంగా మార్చామన్నారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వ్యవవస్థలను సర్వ నాశనం చేసిందన్నారు. 35లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త రోడ్లపై కుప్పలుగా పేరుకొని పోయిందన్నారు. 2029 నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛ సేవకులు కావాలని పిలుపునిచ్చారు. కొందరు స్వార్థపరులు ఆంధ్ర జాతీయ కళాశాలను కబ్జా చేశారని, ప్రభుత్వ దీనిని స్వాధీనం చేసుకుంటుందన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య పేరుతో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. అయితే గత జగన్‌ ప్రభుత్వం చెత్త పన్నును అమలులోకి తెచ్చింది. నాడు దీనిపైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయిన దానిని జగన్‌ ప్రభుత్వం ఉప సంహరించుకోలేదు. నాటి మోదీ ప్రభుత్వానికి మోకరిల్లిన జగన్‌ కేవలం నిధుల కోసం చెత్త పన్నును అమలు చేశారనే విమర్శలు ఉన్నాయి.
Tags:    

Similar News