కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సీఎం చంద్రబాబు దాని అంతు చూడాల్సిందే ...

టెక్నాలజీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంది పుచ్చుకుంటారు. దానిని పాలనలో జోడించే వరకు నిద్రపోరు.;

Update: 2025-01-31 12:57 GMT

ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒక కొత్త టెక్నాలజీ. ఈ సాఫ్ట్ వేర్ మేధావులను సైతం ఆశ్యర్య పరుస్తోంది. దీనిని ఉపయోగించి లేని దానిని ఉన్నట్లు కూడా చూపించొచ్చు. మనిషి అక్కడ లేకుండా ఉండి పనిచేస్తున్నట్లు ఈ టెక్నాలజీ చూపిస్తుంది. కొన్ని వార్తలను తయారు చేసి ఆ వార్తలను సాఫ్ట్ వేర్ లోకి పంపించి దానికి ఒక సారి వార్తలు చదివే వ్యక్తి ఫొటోను, ఆయన వాయిస్ ను జోడిస్తే కంపోజ్ చేసి పంపించిన వార్తలను పూర్తిగా లిప్ మూమెంట్ ఏ మాత్రం అనుమానం రాకుండా చదివి పక్కన పడేస్తుంది. ఇదీ ఈ టెక్నాజీ గొప్పతనం.

ఎన్ని సంస్థలు ఏఐ పై పరిశోధనలు చేస్తున్నాయి..

గూగుల్ ఒక ప్రధాన సాంకేతిక సంస్థ, ఇది AI పరిశోధన మరియు అభివృద్ధిలో చురుకుగా పాల్గొంటుంది. గూగుల్ అనేక AI ఉత్పత్తులను మరియు సేవలను అందిస్తుంది, వీటిలో Google Assistant, Google Search మరియు Google Translate వంటివి ఉన్నాయి.

మైక్రోసాఫ్ట్ మరొక ప్రధాన సాంకేతిక సంస్థ, ఇది AI పరిశోధన, అభివృద్ధిలో చురుకుగా పాల్గొంటుంది. మైక్రోసాఫ్ట్ అనేక AI ఉత్పత్తులను, సేవలను అందిస్తుంది, వీటిలో Azure AI, Microsoft Cognitive Services, Microsoft Research AI వంటివి ఉన్నాయి.

అమెజాన్ ఒక ప్రధాన ఇ-కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ, ఇది AI పరిశోధన, అభివృద్ధిలో చురుకుగా పాల్గొంటుంది. అమెజాన్ అనేక AI ఉత్పత్తులను, సేవలను అందిస్తుంది, వీటిలో Amazon Alexa, Amazon Rekognition, Amazon SageMaker వంటివి ఉన్నాయి.

ఫేస్బుక్ ఒక ప్రధాన సోషల్ మీడియా సంస్థ, ఫేస్బుక్ అనేక AI ఉత్పత్తులను, సేవలను అందిస్తుంది, వీటిలో Facebook AI Research (FAIR), WhatsApp, Instagram వంటివి ఉన్నాయి.

IBM ఒక ప్రధాన సాంకేతిక సంస్థ, AI ఉత్పత్తులను, సేవలను అందిస్తుంది. వీటిలో IBM Watson, IBM Cloud AI, IBM Research AI వంటివి ఉన్నాయి.

OpenAI అనేది లాభాపేక్ష లేని సంస్థ, అనేక AI ఉత్పత్తులను, సేవలను అందిస్తుంది. వీటిలో GPT-3, DALL-E వంటివి ఉన్నాయి.

DeepMind అనేది ఒక AI పరిశోధన సంస్థ. దీనిని Google కొనుగోలు చేసింది. DeepMind అనేక AI ఉత్పత్తులను, సేవలను అందిస్తుంది. వీటిలో AlphaGo, AlphaFold వంటివి ఉన్నాయి.

Delete Edit

Baidu అనేది ఒక ప్రధాన చైనీస్ సాంకేతిక సంస్థ. ఇది AI పరిశోధన, అభివృద్ధిలో పాల్గొంటుంది. Baidu AI Cloud, Baidu Brain, Baidu Apollo వంటివి ఉన్నాయి.

Alibaba అనేది ఒక ప్రధాన చైనీస్ ఇ-కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ. Alibaba Cloud AI, Alibaba DAMO, Alibaba City Brain వంటివి ఉన్నాయి.

Tencent అనేది ఒక ప్రధాన చైనీస్ సాంకేతిక సంస్థ. Tencent AI Lab, Tencent Cloud AI, Tencent WeChat వంటివి ఉన్నాయి.

గూగుల్ తో చంద్రబాబు ఒప్పందం

గూగుల్ సంస్థ ద్వారా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి విద్య, వైద్య రంగాల్లో మరింత నాణ్యత సాధించేందుకు ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. అందులో భాగంగా విశాఖపట్నంలో కొంత స్థలాన్ని గూగుల్ సంస్థకు కేటాయించారు. అమరావతిలో ఏఐ పరిశోధనా స్థానాన్ని స్థాపిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ముందుకొచ్చే సంస్థల సహకారం తీసుకుని అడుగులు వేస్తారు.

1995లోనే ఈ గవర్నెన్స్ తో ముందుకు అడుగులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1995లోనే ‘ఈ గవర్నెన్స్’ పరిపాలనకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత నుంచి కొత్తగా ఏ టెక్నాలజీ వచ్చినా దానిని ప్రభుత్వంలో భాగస్వామిగా చేస్తూ వస్తున్నారు. సెల్ ఫోన్ ను ఉపయోగించి ప్రస్తుతం వాట్నాప్ గవర్నెన్స్ ను ప్రారంభించారు. మెటా ఇండియా ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఒక ప్రత్యేకమైన వాట్సాప్ నెంబరు ద్వారా ప్రజలకు కావాల్సిన సేవలు పొందే అవకాశం ప్రభుత్వం కల్పించింది. రెండు విడతల్లో 520 సేవలు పొందే అవకాశం కల్పించినట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మోటాతో మూడు నెలల క్రితం ఒప్పందం జరిగింది.

2015లో కొత్తగా క్యూఆర్ కోడ్ ను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. క్యూఆర్ కోడ్ ను డెన్సో వేవ్ అనే జపాన్ సంస్థ 1994 లో కనిపెట్టింది. మొదట్లో దీనిని ఆటోమోటివ్ పరిశ్రమలో విడిభాగాలను గుర్తించడానికి ఉపయోగించారు. ఆ తర్వాత ఇతర రంగాలకు కూడా విస్తరించింది. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ లు చెల్లింపులు, సమాచార మార్పిడి, టికెటింగ్, ప్రకటనలు, అనేక ఇతర రంగాలలో ఉపయోగిస్తున్నారు. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పేటీఎం వంటి టెక్నాలజీలను ప్రజలకు పరిచయం చేశారు.

Tags:    

Similar News