ఏపీలో తొలి సారి సీప్లేన్‌ టూరిజం.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విజయవాడ పున్నమిఘాట్‌ నుంచి శ్రీశైలం వరకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, పలువురు మంత్రులు, అధికారులు దీనిలో ప్రయాణించారు.

Update: 2024-11-09 12:20 GMT

దేశంలోనే తొలి సారిగా టూరిజమ్‌ సీప్లేన్‌ సర్వీసును ఆంధ్రప్రదేశ్‌లో వినియోగంలోకి తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, ఏపీ టూరిజమ్‌ మంత్రి కందుల దుర్గేష్, బిసి జనార్ధన్‌ రెడ్డి, అధికారులతో కలిసి సీఎం చంద్రబాబు తొలి సారి ఈ సీప్లేన్‌లో ప్రయాణించారు. దేశంలో తొలి సారిగా సీప్లేన్‌ టూరిజాన్ని సీఎం చంద్రబాబు శనివారం విజయవాడ పున్నమిఘాట్‌ వద్ద ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సీప్లేన్‌ ప్రయాణం ఒక వినూతన్నమైన ప్రయోగమని అన్నారు. భవిష్యత్‌లో మామూలు విమానాశ్రయాలే కాకుండా సీప్లేన్‌లు వినియోగంలోకి వస్తాయని, వీటి ద్వారా రవాణా సౌకర్యం కూడా పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తుందన్నారు. ఆ దిశగా ఏపీ అడుగులు వేస్తుందన్నారు. ప్రపంచంలో సాంకేతికత శర వేగంగా పెరుగుతోందన్నారు. దానిని అందుకునే విధంగా ఏపీ డెవలప్‌ కావాలన్నారు. నిత్యం కొత్త దనంతో కూడుకున్న ఆలోచనలు చేయాలన్నారు.

Delete Edit

సీప్లేన్‌ టూరిజాన్ని ఏపీలో అందుబాటులోకి తెచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుని ఈ సందర్భంగా అభినందించారు. తక్కువ సమయంలో అత్యున్నత స్థాయికి ఎదిగారని, కేంద్ర మంత్రి వర్గంలోనే అత్యంత యువకుడని రామ్మోహన్‌ నాయుడుని అభినందించారు. రానున్న రోజుల్లో ఏ ఇజం ఉండదని, ఒక్క టూరిజమ్‌ మాత్రమే ఉంటుందన్నారు. అనంతరం సీప్లేన్‌లో తొలిసారి సీఎం చంద్రబాబు ప్రయాణించారు. విజయవాడ పున్నమిఘాట్‌ నుంచి శ్రీశైలం వరకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, ఇతర మంత్రులు, అధికారులతో కలిసి సీఎం చంద్రబాబు శ్రీశైలం వెళ్లారు. అక్కడ నుంచి రోప్‌ వే ద్వారా శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు. పంచకట్టుతో ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఆలయ అధికార వర్గాలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భ్రమరాంబికా మల్లికార్జునస్వామికి సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేదాశీర్వాదాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Tags:    

Similar News