జగన్‌ విధానాలు రద్దే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మంత్రి వర్గ సమావేశం

జగన్‌ విధానల రద్దే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కేబినెట్‌ సమావేశం జరిగింది. ఎన్నికల సమయంలో అజెండాలో ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ కానీ, ఇతర పథకాల గురించిన చర్చ లేదు.

Update: 2024-08-28 13:16 GMT

సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో బుధవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కేబినెట్‌ 4 గంటల వరకు కొనసాగింది. ప్రధానంగా గత జగన్‌ ప్రభుత్వం తెరపైకి తెచ్చి అమలు చేపట్టిన పలు అంశాలపై దృష్టి సారించారు. జగన్‌ తెచ్చిన విధానాల రద్దే లక్ష్యంగా కేబినెట్‌ సమావేశంలో చర్చలు జరిపారు. అనంతరం వాటిని రద్దు చేయాలని నిర్ణయానికి వచ్చారు. జగన్‌ ప్రభుత్వం తెచ్చిన వాటిల్లో ప్రధానంగా రివర్స్‌ టెండరింగ్, సెబీ, పాసు పుస్తకాలపై జగన్‌ బొమ్మను తొలగింపు వంటి పలు అంశాలపై కీలక నిర్ణయాలను మంత్రి వర్గం సమావేశం ఆమోదం తెలిపింది.

మరి కొన్ని కీలక నిర్ణయాలు..
ముఖ్యమంత్రి పేషీతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు, మంత్రుల పేషీల్లో పోస్టుల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల పేషీల్లో 71 పోస్టుల భర్తీకి, అలాగే మంత్రుల పేషీల్లో మరో 96 పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు మంత్రి వర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సీఎం, సీఎఓ అధికారుల పేషీలతో పాటు మంత్రుల పేషీలను బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలో తెరపైకి తెచ్చి అమలు చేసిన రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేసి, పాత విధానంలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు, అదే విధానంలో టెండర్లు పిలిచేందుకు రూపొందించిన ప్రత్యేక ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా గత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన మరో విధానాన్ని కూడా సీఎం చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. మద్యం అక్రమ రవాణ, ఇసుక అక్రమ రవాణలను అరికట్టేందుకు తెరపైకి తెచ్చిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబీ)ని రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
జగన్‌ ప్రభుత్వం చేపట్టిన మరో విధానానికి కూడా ఫుల్‌ స్టాప్‌ పెట్టింది. పట్టాదారు పాస్‌ పుస్తకాలపై జగన్‌ ఫొటోను రద్దు చేయాలన్న ప్రతిపాదనలను ఆమోదించింది. జగన్‌తో ఫొటో రద్దుతో పాటు రాజకీయ పార్టీల లోగోను తొలగించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఎవ్వరి ఫొటోలు, రాజకీయ పార్టీల లోగోలు లేకుండా ఆంధ్రప్రదేశ్‌ అధికారిక చిహ్నంతో 21.86లక్షల పట్టాదారు పాస్‌ పుస్తకాలను ఇవ్వాలనే నిర్ణయానికి మంత్రి వర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వివాదాల్లోని భూములను రిజిస్ట్రేషన్‌లు చేపట్టకుంటా నిలిపి వేయాలనే నిర్ణయానికి ఆమోదం తెలిపింది. రూ. 11.51 కోట్లతో ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న రేషన్‌ దుకాణాల్లో ఇపోస్‌లను కొనుగోలు చేసి ఇచ్చేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్దరణకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్ట్‌ సంస్థను మార్చ కూడదని, పోలవరం ఎడమ కాలువ పనులను కూడా పాత ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు సంస్థకే పనులు అప్పగించాలనే ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
Tags:    

Similar News