కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. పులివెందుల్లో జగన్‌ను ఢీకొట్టేది ఎవరంటే!
కాంగ్రెస్ తమ అసెంబ్లీ అభ్యర్థుల మరో జాబితాను విడుదల చేసింది. ఇందులో పలు కీలక నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది.
ఆంధ్ర ఎన్నికలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా పులివెందుల్లో జగన్‌ను తమ పార్టీ నుంచి ఢీకొట్టనున్న అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఆదివారం రాత్రి ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఈరోజు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. 38 మంది అసెంబ్లీ అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే 114 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసిన కాంగ్రెస్ తమ రెండో జాబితాలో కొన్ని కీలక స్థానాల్లో బరిలోకి దిగనున్న అభ్యర్థులను ప్రకటించింది. వీటిలో పులివెందుల కూడా ఉంది. పులివెందుల నుంచి సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యర్థిగా మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. అదే విధంగా హిందూపురంలో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణను కాంగ్రెస్ తరపున మహమ్మద్ హుస్సేన్ ఇనాయతుల్లా ఢీకొట్టనున్నారు. ఈ జాబితాను కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
అయితే 2024 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే అభ్యర్థులను ప్రకటించడం వారి చేత నామినేషన్లు వేయించే ప్రక్రియను కాంగ్రెస్ ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 167 స్థానాల్లో పటీ చేయనుంది. మిగిలిన 8 స్థానాలను కూటమిలో భాగంగా సీపీఐకి కేటాయించారు. ఇప్పటికే 10 స్థానాల్లో అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ మార్చింది.
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా..
హిందూపురం - మహ్మద్ హుస్సేన్ ఇనయతుల్లా (వి నాగరాజు స్థానంలో)
కడప- తుమ్మన్ కల్యాల్ అస్జల్ అలీఖాన్
పులివెందుల- మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి
జగ్గయ్యపేట - కర్నాటి అప్పారావు
తాడికొండ (ఎస్సీ) - మణిచల సుశీల్ రాజా (చిలకా విజయ్ కుమార్ స్థానంలో..)
రేపల్లె - మోపిదేవి శ్రీనివాసరావు
తెనాలి - ఎస్‌కే బషీద్
గుంటూరు వెస్ట్ - డాక్టర్. రాచకొండ జాన్ బాబు
చీరాల - ఆమంచి కృష్ణమోహన్
శ్రీకాకుళం - అంబటి కృష్ణారావు (పాడి నాగభూషణరావు స్థానంలో)
బొబ్బిలి- మరిపి విద్యాసాగర్
గజపతినగరం- దోలా శ్రీనివాస్ (కురిమినాయుడు స్థానంలో)
నెల్లిమర్ల - ఎస్.రమేశ్‌కుమార్
ఒంగోలు - తుర్లపాక నాగలక్ష్మీ (బుట్టి రమేశ్‌బాబు స్థానంలో)
కనిగిరి - దేవరపల్లి సుబ్బారెడ్డి (కదిరి భవానీ)
కావలి - పొదలకూరి కల్యాణ్
విశాఖపట్నం ఉత్తరం - లక్కరాజు రామారావు
కోవూరు - నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి (నెబ్రంబాకం మోహన్ స్థానంలో)
సర్వేపల్లి - పి.వి. శ్రీకాంత్‌రెడ్డి (పూల చంద్రశేఖర్ స్థానంలో)
గూడురు (ఎస్సీ) డాక్టర్. యు రామకృష్ణారావు (వేమయ్య చిలుకూరి స్థానంలో)
ఆలూరు - నవీన్ కిషోర్ ఆరకట్ల
కల్యాణ్‌దుర్గం- పి. రాంభూపాల్ రెడ్డి
జమ్మలమడుగు - బ్రహ్మానందరెడ్డి పాముల
ప్రొద్దుటూరు - షేక్ పూల మహ్మద్ నజీర్
మైదుకూరు- గుండ్లకుంట శ్రీరాములు
సూళ్లూరుపేట(ఎస్సీ- చందనమూడి శివ (గడి తిలక్‌బాబు స్థానంలో)
వెంకటగిరి - పి.శ్రీనివాసులు
చోడవరం - జగత్ శ్రీనివాస్
యలమంచిలి - టి.నర్సింగ్ రావు
డోన్ - గారపాటి మధులెట్టి స్వామి
ఆదోని - గొల్ల రమేశ్
పి.గన్నవరం (ఎస్సీ) - కె.చిట్టిబాబు
ఆచంట - నెక్కంటి వెంకట సత్యనారాయణ
విజయవాడ (ఈస్ట్) - సుంకర పద్మశ్రీ
ఆళ్లగడ్డ- బారగొడ్ల హుస్సేన్
శ్రీశైలం- అసర్ సయ్యద్ ఇస్మాయిల్
బనగానపల్లె - గూటం పుల్లయ్య
ధర్మవరం- రంగాన అశ్వర్థ నారాయణ