‘నేను కావాలనే చేశా’.. దివ్వల మాధురికి ప్రమాదం..

దివ్వల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. పలాసలో ఆగిఉన్న కారును ఆమె నడుపుతున్న కారుతో ఢీకొట్టింది. తాను ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతోనే తాను ఇలా చేశానని ఆమె చెప్తున్నారు.

Update: 2024-08-11 10:43 GMT

దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి ఎపిసోడ్‌ కీలక ట్విస్ట్ తిరిగింది. కొన్ని రోజులుగా వీరి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో దివ్వల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. పలాసలో ఆగిఉన్న కారును ఆమె నడుపుతున్న కారుతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కారు బోల్తాకొట్టింది. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆమెను హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలాస లక్ష్మీపురం టోల్‌గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.


అయితే తాను ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతోనే తాను ఇలా చేశానని ఆమె చెప్తున్నారు. తనకు వైద్యం అందించొద్దంటూ డాక్టర్లను వేడుకుంటున్నారు మాధురి. పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ‘‘మెంటల్ డిప్రెషన్‌లో చనిపోదామని టెక్కలి నుంచి వచ్చాను. వేధింపులు తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ వేధింపులు, ఆరోపణల వల్ల నా కుటుంబీకులు చాలా సఫర్ అవుతున్నారు. నా పిల్లలపై చేసిన కామెంట్లను నేను తీసుకోలేకున్నాను. వాటి వల్లే నేను డిప్రెషన్‌కు గురవుతున్నాను. నన్ను ఇంతే వదిలేయండి. నేను ఇక్కడే చచ్చిపోతాను’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు వివేదం ఏంటంటే..

దువ్వాడ శ్రీనివాస్, మాదురి మధ్య అక్రమ సంబంధం ఉందంటూ దువ్వాడ వాణి తీవ్ర ఆరోపణలు చేశారు. దువ్వాడ కుమార్తెలు కూడా తమకు తమ నాన్న కావాలంటూ దువ్వాడ శ్రీనివాస్.. ఇంటి దగ్గర రెండు రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా ఉంది. ‘మాకు మా డాడి కావాలి. మేం మా నాన్నతోనే ఉండాలనుకుంటున్నాం. మా నాన్నకు చాలా సార్లు చెప్పాం. మా మంచి, చెడు నాన్నకు తెలుసు. ఆయన మరో మహిళ ట్రాప్‌లో పడ్డారు. ఆమే మా ఇంట్లో చిచ్చు పెట్టింది. మా డాడి పొలిటికల్ పవర్ వాడుకోవాలనే ఆ మహిళ దగ్గరైంది. మాకు న్యాయం చేయండి’’ అని దువ్వాడ హైందవి వివరించారు.

అనుబంధంపై మాధురి ఏమన్నారంటే..

‘‘ఎవరితో అయినా కలిసి ఉండే హక్కు నాకుంది. నాది, దువ్వాడ శ్రీనివాస్‌ది ఇల్లీగల్ ఎఫైర్ కాదు. మేము పెళ్ళి చేసుకుని ఉంటే అది ఇల్లీగల్. కానీ మేము పెళ్ళి చేసుకోలేదు. దువ్వాడ వాణి కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే.. భర్తతో కూర్చుని మాట్లాడుకోని వాటిని పరిష్కరించుకోవాలి. అయినా రెండేళ్లుగా ఆమెకు భర్త ఎందుకు గుర్తుకు రాలేదు. ఆమె ఇప్పటికి కూడా రాజకీయ లబ్ది పొందాలనే నన్ను, దువ్వాడను టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తున్నారు. అందుకే నేను బయటకు వచ్చాను. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నన్ను క్యారెక్టర్ లేని మహిళ అని చెప్పి, దానిని మీడియా అంతా ప్రచారం చేస్తే అది నా పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. ఎలాగూ ఏమీ లేకపోయినా.. నాపై తప్పుడు ప్రచారం చేశారు. కాబట్టి ఇకపై నేను దువ్వాడతోనే ఉంటా’’ అని స్పష్టం చేశారు.

Tags:    

Similar News