జగన్ లండన్ వెళ్లడానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా..!
సీఎం వైఎస్ జగన్.. కోర్టును కోరి మరీ తన యూరప్ ట్రిప్‌కు అనుమతులు తెచ్చుకున్నారు. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన లండన్‌కు బయలుదేరారు.
సీఎం వైఎస్ జగన్.. కోర్టును కోరి మరీ తన యూరప్ ట్రిప్‌కు అనుమతులు తెచ్చుకున్నారు. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన లండన్‌కు బయలుదేరారు. ఇప్పుడు ఆయన లండన్‌కు ప్రయాణం చేస్తున్న విమానమే రాష్ట్రమంతటా హాట్ టాపిక్‌గా ఉంది. దీని వివరాలు తెలుసుకున్న అనేకమంది.. మీ పేదింటి బిడ్డ అని చెప్పే జగన్ ఇంత రిచ్చా అంటూ, ఇంకా దయదలచి అద్దెకు తీసుకున్నారని, అవసరమైతే అలాంటి విమానాలను వరసపెట్టి వంద కొనేస్తారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ ఆ విమానం అంత లగ్జారీనా అంటే అవుననే చెప్పాలి.
సీఎం జగన్.. లండన్‌కు ప్రయాణించే ప్రత్యేక విమానంలో కేవలం 14 మందే ప్రయాణించగలరు. ఇందులో 14 మందికి సరిపోయేలా సీట్లు ఉంటాయి. దాంతో పాటుగా బెడ్లు కూడా ఉంటాయి. ఈ విమానం అద్దె రూ.12 లక్షలు ఇది పూర్తి ట్రిప్‌కు కాదండోయ్.. కేవలం గంట సేపటికి మాత్రమే. ఈ విమానాన్ని గంటకు అద్దెకు తీసుకుంటే అక్షరాలా రూ.12 లక్షలు కట్టాల్సిందే. అలాంటి దీనిలో సీఎం జగన్.. లండన్ వరకు ప్రయాణించనున్నారు. అంటే సుమారు 9 గంటల ప్రయాణం. అయితే బయట సాధారణ విమానాల్లో వెళ్తే ఎకానమీ క్లాస్ టికెట్ అయితే ఒక వ్యక్తి రూ.25 నుంచి 55 వేల మధ్య పడుతుంది. అదే బిజినెస్ క్లాస్‌లో వెళితే అది రూ.1.5 నుంచి 2 లక్షల వరకు పడుతుంది. ఫస్ట్ క్లాస్‌లో వెళితే దాదాపు ఒక్కో వ్యక్తి రూ.3లక్షల వరకు ఖర్చు కావొచ్చు. అంటే ప్రస్తుతం సీఎం జగన్‌తో పాటు ఆ ప్రత్యేక విమనాంలో మరో ముగ్గురు ప్రయాణించనున్నారు. అంటే వారు ఫస్ట్ క్లాస్‌లో లండన్‌కు వెళ్లినా వారికి అయ్యే ఖర్చు రూ.12 నుంచి 20 లక్షల ఖర్చు కావొచ్చు. కానీ వాళ్లు ఇప్పుడు ప్రయాణిస్తున్న విమానం మాత్రం గంటలకు రూ.12 లక్షల అద్దె వసూలు చేస్తున్నారు. అంటే లండన్‌కు వెళ్లడానికే జగన్ వాళ్లకు రూ.1.08 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది కేవలం వెళ్లే సమయానికి అయ్యే ఖర్చు. అటువంటి జగన్ తన వెకేషన్‌లో భాగంగా నాలుగు దేశాల్లో పర్యటించనున్నారు. దీంతో పాటుగా ఈ ట్రిప్ సమయంలో జగన్ భద్రతకు అయ్యే ఖర్చు దాదాపు రూ.1.5 కోట్లు ఉండనుంది. దాని మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరాయించనుంది.
కొద్ది సేపటి క్రితమే సీఎం వైఎస్ జగన్.. లండన్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు సిబ్బంది స్వాగతం పలికారు. ఆయనను భారీ భద్రత మధ్య విమానాశ్రయం నుంచి బయటకు తీసుకెళ్లారు.