రాష్ట్రంలో పనిచేసే వయసున్న వారు ఎంత మందో తెలుసా?

రాష్ట్రంలో పనిచేసే వయసు ఉన్న వారు ఎంత మంది ఉన్నారు? వీరి వివరాలను ప్రభుత్వం ఎందుకు కావాలనుకుంటోంది? ఇందు కోసం ఏమి చేయనుంది?

Update: 2024-08-14 10:02 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పనిచేసే వయసు ఉన్న వారు ఎంత మంది ఉన్నారనే దానిపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ మేరకు లెక్కలు తేల్చింది. వీరందరి సేవలు ఎలా ఉపయోగించుకోవాలి. ఎలా రాష్ట్ర సంపద పెంచాలనే అంశంపై తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో పలు సార్లు ఉన్నాధికారులతో చర్చించారు. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి స్కిల్‌ డెవలప్‌ మెంట్‌పై ప్రత్యేక శిక్షణ ఉంటుందని చెబుతూ వస్తున్నారు. ఆయన పనిచేసే వయసున్న వారందరినీ దృష్టిలో పెట్టుకుని ఎవరు ఎందులో నిపుణులో గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలనే ఆలోచనకు వచ్చారు. రాష్ట్రలోని ప్రతి ఒక్కరూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా చేయాలనేదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

పనిచేసే వయసున్న వారు ఎంత మంది?
ప్రస్తుతం రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండి పనిచే వయసు ఉన్న వారి సంఖ్య 3.54 కోట్లుగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర జనాభా సుమారు ఆరు కోట్లు ఉన్నదనుకుంటే అందులో సగం మంది పనిచేసే వయసు ఉన్న వారు ఉన్నారు. వయసులో పెద్దవారు ఉన్నా వారి మేధస్సు కూడా రాష్ట్రాభివృద్ధికి ఉపయోగ పడుతోంది. అందువల్ల ప్రస్తుతం పనిచేసే వయసున్న వారిని గణించాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. గణన ఏవిధంగా జరగాలనే అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్చించారు. ఈ ఆలోచనలు తన కుమారుడు లోకేష్‌తో కూడా పంచుకున్నారు. ఏయే రంగాల్లో ఎంత మంది పనిచేసే వారు ఉన్నారు అనే అంశాన్ని ముందుగా గుర్తించాలి. ఇందుకు గణన జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గణనకు ఎంత మంది సిబ్బంది కావాలి..
నైపుణ్య గణన నిర్వహించేందుకు 40 వేల మంది ఎన్యుమరేటర్లు కావాలని అధికారులు సూచించారు. త్వరగా గణన పూర్తి కావాలంటే ఇంకా ఎక్కువ మంది సిబ్బది కావాలే కాని తగ్గటానికి వీలు లేదని అధికారులు భావిస్తున్నారు. సర్వే చేసేందుకు 55 నుంచి 70 వ్యవధి తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ 70 రోజుల్లో గణన సర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు. మొత్తం ప్రక్రియ 8నెలల లోపు కంప్లీట్‌ కావాలని, అప్పటికి ఏ రంగంలో ఎంత మంది నిపుణులనేది తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 1.60 కోట్ల కుటుంబాల్లో పనిచేసే వయసు ఉన్న వారు ఉన్నట్లు గుర్తించారు.
గణన పూర్తయిన తరువాత ఏమి చేస్తారు?
నైపుణ్య గణన పూర్తయిన తరువాత ఆయా రంగాలకు సంబంధించిన శిక్షణ ఇచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శిక్షణ కూడా పకడ్బంధీగా ఇవ్వాలని నిర్ణయించారు. నైపుణ్య శిక్షణ శాఖ వద్దకు పలు కంపెనీల వారు నేరుగా వచ్చి శిక్షణ పొందిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకునే విధంగా వారి పనితనం ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. శిక్షణ ఏ రంగంలో తీసుకుంటున్నారో ఆ రంగానికి సంబంధించి ప్రాక్టికల్‌ వర్క్‌ చేసి చూపించిన తరువాతనే వారిని ఉద్యోగంలోకి తీసుకునే విధంగా ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. ప్రస్తుతం ఇంజీనింగ్‌ చదువుతున్న వారికి క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి వివిధ కంపెనీలు ఎలా ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయో అలా తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. స్కిల్‌ ఉండి, పనిచేయగలిగి ఉద్యోగం లేక నిరుద్యోగిగా మిగిలి పోకూడదనేదే ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్నారు. పరిశ్రమల శాఖ సమావేశంలో టీజీ భరత్‌తో సీఎం చంద్రబాబునాయుడు లోతుగా చర్చించారు. పారిశ్రామిక రంగంపై అవగాహన ఉన్న భరత్‌ ప్రభుత్వ, పైవేట్‌ భాగస్వామ్యం ద్వారా పరిశ్రమలు ఎలా అభివృద్ది జరుగుతాయో సీఎంకు వివరించి చెప్పారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ను కూడా సబ్సిడీ ఇవ్వడం ద్వారా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సíß ంచవచ్చనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. 2025 వరకు చిన్న తరహా పరిశ్రమలకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. దీనిపై కూడా దృష్టిపెట్టి ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు ముందుకు వచ్చే వారికి అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Tags:    

Similar News