రుషికొండ ప్యాలెస్ లో చంద్రబాబు ఏమి చూశాడో తెలుసా?

రుషికొండ ప్యాలెస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అద్భుతాలు చూశారు. అవి ఏమిటో తెలుసా? ఇప్పుడు మనం తెలుసుకుందాం...

Update: 2024-11-03 03:44 GMT

రుషికొండ ఇప్పుడు వార్తల్లో కొండ. విశాఖ నగరానికి తలమానికంగా చెప్పుకునేదే రుషికొండ. ఈ కొండపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ గొప్ప ప్యాలెస్ నిర్మించారనేది ఇప్పుడు చర్చనియాంశమైన అంశం. దీని గురించే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రుషికొండ ప్యాలెస్ ఎవరి కోసం కట్టారు. ఇంత ఖర్చు అవసరమా? ఈ డబ్బుతో ప్రజలకు ఏదైనా చేయొచ్చనేది ముఖ్యమంత్రి చంద్రబాబు మాట. ఏది ఏమైనా రుషికొండపై వైఎస్ జగన్ ప్యాలెస్ నిర్మించారు. ఆ ప్యాలెస్ రాజరిక వ్యవస్థకు నిలువుటద్దం పడుతోందనేది పెద్ద చర్చ. చంద్రబాబు నాయుడు శనివారం ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్మించిన ఫ్యాలెస్ లో ఏమేమి చూసి ఆశ్చర్య పోయారనేది చర్చించాల్సిన అంశమే.

Delete Edit

రుషికొండపై జగన్ నిర్మించిన ప్యాలెస్ లోని ప్రతి బ్లాక్ ను తిరిగి పరిశీలించారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుడు ఆయన గమనించిన అంశాలను ఏవిధంగా చెప్పారనేది ఆసక్తిగా మారింది. నేను నిజాం ప్యాలెస్, పలక్ నుమా ప్యాలెస్ లు చూశా. ఇప్పుడు జగన్ కట్టిన ప్యాలెస్ ను చూశా. ఉద్వేగం, ఆశ్చర్యం కలిగింది. ఇన్ని హంగులతో రాజులు కూడా తమ ప్యాలెస్ లు నిర్మించుకోలేదని చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల కోసం రూ. 400 కోట్లు ఖర్చు పెట్టలేదు. రూ. 430 కోట్లు తాను అప్పుడప్పుడు వచ్చి ఉండే ప్యాలెస్ కోసం ఖర్చు పెట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈయన ఏమన్నా.. రాజా.. చక్రవర్తినా.. అంటూ చంద్రబాబు ప్రశ్నించిన తీరు పలువురి దృష్టిని ఆకర్షించింది. 7 బ్లాకులను 13,548 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్యాలెస్ నిర్మాణం జరిగింది. కొండ చుట్టూ 18 ఎకరాల స్థలంలో జపాన్ టెక్నాలజీతో ఫ్రొటెక్షన్ గోడ నిర్మాణం జరిగింది. పీఎం, ప్రెసిడెంట్ ల విడిది కోసం కడుతున్నామని చెప్పారు. వారు నావెల్డ్ గెస్ట్ హౌస్ లోనే ఉంటున్నారు. ఇలాంటి ప్యాలెస్ లు కట్టమని వారు అడగలేదరు కదా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Delete Edit

కబోర్డ్ లకు రూ. 12 లక్షలు ఖర్చు చేశారు. 9.88 ఎకరాల్లో పర్యావరణం విధ్వంసమైందని సీఎం ఆరోపించారు. దేశంలో అత్యంత అరుదైన ప్రదేశం. దేనికి పనికి రాకుండా భవంతులు కట్టారు. ఈ ప్రాంత సరిహద్దుల్లోకి ఎవరినీ రాకుండా కట్టడి చేసి హైకోర్ట్, ఎన్జీటీ, కేంద్ర ప్రభుత్వాలను మభ్య పెట్టి అధికారులను భయపెట్టి, ప్రజలను మోసం చేశారని సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. కళింగ హాలులో 300 మంది కూర్చొనేందుకు నిర్మాణం జరిగిందని, అప్పట్లో ఉన్న రాజులకు కూడా ఇటువంటి ఆలోచనలు లేవన్నారు. వేంగి పేరుతో బ్లాక్ నిర్మించారని, ఈ బ్లాక్ పేరు ఏమిటో అర్థం కాలేదని సీఎం స్వయంగా అన్నారు.

Delete Edit

దీనికి విద్యుత్ ను అందించేందుకు 100 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్. 200 టన్నుల సెంట్రల్ ఏసీ, ఎటువైపు నుంచి చూసినా సముద్రం కనిపించేలా వ్యూతో కనిపించే విధంగా నిర్మించారని సీఎం చెప్పారు. ఇలాంటి రాజరికపు పోకడలు ఉన్న వ్యక్తి రాజకీయాల్లో అవసరమా? అనే అంశంపై చర్చ జరగాల్సి ఉందన్నారు. రూఫ్ కు బిగించిన లైట్లు, మిరుమిట్లు గొలిపే కాంతులు ఇవన్నీ రాజుల కోటల్లోనే ఉంటాయనే భావనను సీఎం వ్యక్తం చేశారు.

రుషికొండ విశాఖ నగరంలోని కొన్ని లక్షల మందికి ఆక్షిజన్ అందించే కొండ. అటువంటి కొండను తొలిచి భవనాలు నిర్మించటాన్ని పర్యావరణ వేత్తలు ఎవ్వరూ హర్షించడం లేదు. పచ్చగా కనిపించే రుషికొండ నేడు కాంక్రీట్ జంగిల్ తో నిండిపోయింది.

Tags:    

Similar News