చిలకలూరిపేటలోనే పీఎం సభ ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రధానమంత్రి సభ ఎందుకు జరుగుతోందో తెలుసా? ఎవరు ఈ కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు.;

Byline :  The Federal
Update: 2024-03-09 17:46 GMT
PM MODI, Chandrababu, Pavankalyan

తెలుగుదేశం, జనసేన, టీడీపీ పొత్తులు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఆ పార్టీ పెద్దలు నిర్ణయించారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు.

ఈ నెల 17 నిర్ణయించాలని ముహూర్తం ఖరారు చేశారు. ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట వేదికగా ఈ సభను నిర్వహించనున్నారు. బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం సమీపంలో నిర్వహించాలని నిర్ణయించారు.

దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని టీడీపీ, జనసేన పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. చిలకలూరిపేటలో జరిగే సభ ఏర్పాట్ల బాధ్యతలను కొంత మంది సీనియర్‌ నేతలకు అప్పగించారు. ప్రత్తిపాటి పుల్లారావు, ఏలూరు సాంబశివరాలు, దామచర్ల సత్య, వేపాడ చిరంజీవిరావు, పెందుర్తి వెంకటేష్, చదలవాడ అరవిందబాబు, జనసేన నేతలైన గాదె వెంకటేశ్వరరావు, రాజు రమేష్‌లు శనివారం సభాస్థలి ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు.

శనివారం చంద్రబాబు ఢిల్లీ నుంచి టెలీ కాన్‌ఫెరెన్స్‌ ద్వారా ముఖ్య నాయకులతో మాట్లాడారు. ప్రధానమంత్రి వస్తున్నందున భారీ ఎత్తున జన సమీకరణ చేయాలనే దిశగా అడుగులు వేయాలని ఆదేశించారు. పీఎం సభను విజయవంతం చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తగిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

నర్సరావు పేట పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణ దేవరాయలు పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్‌సీపీ ఎంపీగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ వారు టిక్కెట్‌ ఇచ్చేది లేదని చెప్పడంతో ఆయన టీడిపి లో చేరారు.
 ఆయనే చంద్రబాబుకు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు చిలకలూరిపేటలో సభ నిర్వహిస్తానని చెప్పినట్లు సమాచారం.
అయితే ఈ విషయాన్ని శ్రీకృష్ణ దేవరాయలుతో ఫోన్‌లో ఫెడరల్‌ ప్రతినిది సంప్రదించగా ప్రోగ్రాం  ఇంకా ఖరారు కాలేదన్నారు.
అయితే చంద్రబాబు మాత్రం ముఖ్యనాయకులకు సభ ఏర్పాట్లు అప్పగించారు.
సభలో ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటించే అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీనీ ఓడించేందుకు ఇది మంచి తరుణమని, ప్రధానమంత్రి సైతం మనవద్దకు వచ్చి ఎన్నికల సభలో పాల్గొననున్నందున జరిగే కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ మాత్రమే అనుకున్న స్థాయిలో ఏర్పాటు చేస్తుందనే నమ్మకాన్ని ప్రధానికి కలిగించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.
ఈ సభలో ఉమ్మడి మేనిపెస్టోను ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మ్యానిఫెస్టో తయారైంది. బీజేపీ కూడా చేరడంతో తిరగి ఎన్డీయే కూటమి తరుపున మేనిఫెస్టోను ప్రకటించేదుకు చర్యలు తీసుకంటున్నారు. అలాగే అభ్యర్థులను కూడా ఈ వేదికపై నుంచి ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను, జనసేన 5గురు అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగిలిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రకటించేదుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పొత్తుల ప్రకారం పనిచేసి విజయం సాధించేందుకు ముందడుగు వేయాలనే ఆలోచనలో ఎన్‌డీఏ ఉంది. ఈ సభలోనే విజయం సాధించే వైపుగా దిశ నిర్థేశం చేయనున్నారు.


Tags:    

Similar News