ఇకపై వ్యవసాయంలో డ్రోన్ ఒక భాగం

గతంలో ఎద్దులు, బండ్లు వ్యవసాయంలో తోడుండేవి. ప్రస్తుతం ట్రాక్టర్లు, ఇతర పరికరాలు తోడుగా ఉన్నాయి. ఇకపై డ్రోన్స్ ఈ వరుసలోకి వస్తున్నాయి.;

Update: 2025-01-28 05:18 GMT

రైతులు పంటలకు పురుగు మందులు, రసాయన ఎరువులు వాడే విషయంలో ప్రస్తుతం చాలా ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు గతంలో మాదిరి దొరకడం లేదు. నిర్మాణ రంగంలో ఎక్కువ మంది కూలీలు ఉన్నారు. గతంలో వ్యవసాయ కూలీలకు రూ. 300లు ఇస్తుంటే ప్రస్తుతం రూ. 500 నుంచి 800ల వరకు ఇచ్చినా కూలీలు రావడం లేదని రైతులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని రైతు నారు వెంకటరెడ్డి మాట్లాడుతూ కూలీలు ఇకపై వ్యవసాయ పనులకు వచ్చే పరిస్థితులు లేవన్నారు. వరి కోయడానికి యంత్రాలు రావడంతో కొంత వరకు ఇబ్బందులు తప్పాయని, నూర్పిడి యంత్రాలు కూడా రావడంతో చాలా వరకు రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇకపై డ్రోన్స్ ద్వారా కలుపు నివారణ మందులు, బలం మందులు, పంట ఎదుగుదలకు ఉపయోగ పడే మందులు, పురుగులు రాకుండా వాడే మందులు ఉపయోగించుకునేందుకు అవకాశం ప్రభుత్వం కల్పించడం మంచి విషయమన్నారు.

డ్రోన్ ద్వారా పొలం పనులు చేయించాలంటే దానిని ఆపరేట్ చేసేందుకు శిక్షణ పొందిన రైతు కావాల్సి ఉంటుంది. డ్రోన్ లో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. మిషన్ కు టైమింగ్స్ సెట్ చేస్తే ఆ సమయాల ప్రకారం తన పని తాను చేసుకునే రోబో సిస్టం ఉన్నందున రైతులు, డ్రోన్ అద్దెలకు ఇచ్చే వారికి కూడా చాలా వరకు శ్రమ తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ టెక్నాలజీ అమలులో ఉన్నప్పటికీ ఎక్కడో కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉంది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యులు తీసుకుంటోంది.

వ్యవసాయ దారుల ఆదాయం పెంచడానికి ప్రభుత్వం 2024-25 సంవత్సరంలో 875 గ్రామాల్లో డ్రోన్స్ కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రూ. 10.00 లక్షలు యూనిట్ విలువతో 80 శాతం వరకు సబ్సిడీ పై డ్రోన్స్ ప్రభుత్వం రైతులకు అందుబాటులోకి తెస్తుంది. 50 శాతం బ్యాంకు ఋణ సాయంతో వ్యవసాయ డ్రోన్ లతో గ్రామ స్టాయి యాoత్రీకరణ కేంద్రాలు రూ. 70 కోట్ల రాయితీ సొమ్ముతో ఏర్పాటు చేయదానికి అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఈ కేంద్రాల ఏర్పాటు కు అన్ని జిల్లాల్లోని వాణిజ్య పంటలు, పిచికారీ ఎక్కువగా అవసరమయ్యే పంటలు, ఒకే పంట ఎక్కువగా పండించే మండలాల్లో ప్రాధాన్యతను అనుసరించి కమిటీలు ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన ఆర్ఎస్కే పరిధి లోని గ్రామాల్లో భూమి ఉండీ.. వ్యవసాయం చేస్తూ ఉన్న వారికి ఎక్కువగా అవకాశం ప్రభుత్వం కల్పించింది. రైతు సేవా కేంద్రం ద్వారా బాడుగ పై యంత్ర సేవలు అందిస్తూ ఆదాయం సంపాదించడానికి ఆసక్తి ఉన్న 4-5 గురు రైతులతో రైతు సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఈ డ్రోన్లు కొనుగోలుకు ఆర్ధిక సహాయం కోసం ఋణ సదుపాయను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్యNG రంగా విశ్వవిద్యాలయం (ANGRAU), కార్యక్రమం అమలుకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. ఇంత అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు ఇవ్వబోయేటప్పుడు దానిని క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యమైన, స్థిరంగా పనిచేసే డ్రోన్ లను రైతులకు అందజేయడానికి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలొ ఒక రాష్ట్ర స్థాయి కమిటీని ఎర్పాటు చేసింది. ఈ కమిటి నాణ్యమైన డ్రోన్ యూనిట్లను రైతులకు అందజేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. దీనిలో బాగంగా అర్హత కలిగిన కంపెనీలు DGCA (Directorate General of Civil Aviation) దృవీకరించిన డ్రోన్ మోడల్స్ ను కొనుగోలు చేసేందుకు వ్యవసాయ శాఖను కోరినట్లు తెలిపారు. నోమోదు కోరిన డ్రోన్లను - వ్యవసాయ శాఖ అధికారులు, ANGRAU శాస్రవేత్తలు, డ్రోన్ కార్పొరేషన్ సాంకేతిక అధికారులతో కూడిన సాంకేతిక కమిటీ ద్వారా ANGRAU, LAM, గుంటూరు నందు పరిశీలించి పరీక్షించడం జరుగుతున్నదని ఢిల్లీరావు తెలిపారు.

డ్రోన్లకు భారత ప్రభుత్వం (DGCA) జారీ చేసిన ప్రతేక గుర్తింపు సంఖ్య ను, TYPE సర్టిఫికేట్ ప్రకారం వివిధ ప్రామాణికాలను, బ్యాటరీలను, ఇన్సూరెన్స్ వివరాలు పరిశీలించడం తో పాటు, పొలం లో వుండే వివిధ పరిస్థితులలో డ్రోన్ పిచికారీ చేసే పనితీరు క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. పంట మీద నుంచి రెండు అడుగుల నుంచి మూడు అడుగుల ఎత్తులో స్థిరంగా పిచికారీ చేయడాన్ని, పొలాల్లో చెట్లు, కరెంటు పోల్స్, కరెంటు తీగలు వంటివి అడ్డంకులు వున్నప్పుడు పనితీరు, పొలంలో పిచికారీ కొరకు మ్యాప్పింగ్ చేసే విధానం, మ్యాప్పింగ్ పరిధిలో పిచికారీ చేసే విధానం, ఒక బ్యాటరీ చార్జింగ్ తో ఎన్ని ఎకరాలు పిచికారీ చేసే అవకాశం ఉంది, బ్యాటరీ లేదా నీళ్లు అయిపోయిన పరిస్థితులలో యధాస్థితికి తనంతట తానే వచ్చి ల్యాండ్ అయ్యే విధానం, పది లీటర్ల ద్రావకం తో ఎకరం పిచికారీ చేయగలిగే విధానం, పంట మీద స్థిరమైన ఎత్తులో సమానంగా ప్రయాణం చేసి ఏక రీతిగా మందు పిచికారి చేసే విధానం, ఒక రోజులో కనీసం 20 ఎకరాలు పిచికారీ చేసే సామర్ధ్యం వంటి ప్రామాణికాలను పరీక్షించి, పరిశీలించిన మీదట సాంకేతిక కమిటీ, రాష్ట్ర స్థాయి కమిటీకి పూర్తి నివేదికను అందించనున్నారు.

వీటి పని తీరును రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలించి, స్థిరంగా చాల కాలం పనిచేసే నాణ్యమైన డ్రోన్లను నమోదు చేసిన తరువాత, రైతు గ్రూపులు వారి అభీష్టం మేరకు డ్రోన్ మోడల్ ను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పిస్తుంది. వ్యవసాయ డ్రోన్ పరికరాలు ఉపయోగించి వ్యవసాయ పెట్టుబడులను తగ్గించి సకాలంలొ పురుగు మందులు మరియు సూక్ష్మ ఎరువులను పంటలకు అందించి రైతు ఆదాయాన్ని పెంచడానికి గ్రామ స్టాయి యాoత్రీ కరణ కేంద్రాలు విజయవంతంగా పని చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది.

Tags:    

Similar News