ఏపీలో అక్టోబరు 3 నుంచి దసరా సెలవులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది దసరా సెలవులను ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల మూడో తేదీ నుంచి దసరా సెలవులు ఖరారు చేస్తూ ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించింది. ఆ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు పాఠశాలలకు కూడా ఇవి వర్తించనున్నాయి. ఈ మేరకు అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు పాఠశాలలకు, వాటి యాజమాన్యాలకు కఠినమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. దసరా సెలవుల్లో పాఠశాలలను నిర్వహించడం కానీ ప్రత్యేక తరగతులు కానీ నిర్వహించకూడదని హెచ్చరించింది. పదో తరగతికి కూడా ఎలాంటి స్పెషల్ క్లాసులు నిర్వహించ కూడదని హుకుం జారీ చేసింది. ఒక వేళ నిబంధనలను అతిక్రమించి తరగతులు, ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తే అలాంటి పాఠశాలలు, యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.