ఆంధ్రప్రదేశ్‌లో కంపించిన భూమి

భయాందోళనలతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి ప్రజలు పరుగు తీశారు.

Update: 2024-12-04 04:43 GMT

ఆంధ్రప్రదేశ్‌లో భూకంప వాతావరణం నెలకొంది. బుధవారం ఉదయం పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఎన్టీఆర్‌ జిల్లాతో పాటు విశాఖపట్నం, ఏలూరు వంటి ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి నష్టం వాటిల్లక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎన్జీఆర్‌ జిల్లాలో విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ, ఈ జిల్లాకు సమీపంలోని ఏలూరులో భూమి కంపించింది. విశాఖలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. బుధవారం ఉదయం 7.27 గంటలకు భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో భూ ప్రకంపనలు రావడం విశేషం. భూమి ప్రకంపనల తర్వాత రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదైంది. 

Tags:    

Similar News