తిరుమలలో చెప్పులతో ఆలయంలోకి వెళ్లడమా? సెక్యూరిటీ ఏం చేసింది?

ఆలయంలో నిఘా లోపం మరోసారి బయటపడింది.;

Update: 2025-04-12 07:53 GMT

తిరుమలను అత్యంత పవిత్రమైన ప్రదేశంగా ఆరాధిస్తారు. ఆలయ మాడవీధుల్లో కూడా పాదరక్షలు ( చెప్పులు) ధరించి నడవడానికి ఏమాత్రం ఇష్టపడరు. అలాంటిది ఏకంగా ఓ భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని. దర్శించుకోవడానికి శ్రీవాణి టికెట్ దర్శనం క్యూలో చెప్పులు ధరించే వెళ్లారు. ఆలయ మహా ద్వారం వరకు వెళ్లాక గాని అక్కడి టిటిడి ఉద్యోగులు గుర్తించలేకపోయారు.

శ్రీవారి ఆలయం లోకి ప్రవేశించాలి అంటే మొదట వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆశాంతం పరిశీలించి, క్షుణ్ణంగా తనిఖీ చేసి కాని కంపార్ట్మెంట్ లోకి వదలరు. ఇక్కడ టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీతోపాటు ఉద్యోగులు కూడా విధినిర్వహణలో ఉంటారు. అనేక తనకి కేంద్రాలను దాటుకునే వెళుతున్న పాదరక్షలు ధరించి ఉన్న విషయాన్ని మాత్రం ఏ ఒక్కరూ గమనించలేదు. అంటే టీటీడీ నిఘా వ్యవస్థ, పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉంది అనేది తాజా సంఘటన ద్వారా మరోసారి నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది.

చెప్పులతోనే ఆలయంలోకి ఎలా..

కలియుగ వేంకటేశ్వరస్వామి కొలువైన ఉన్న మహా పుణ్యక్షేత్రం తిరుమల కొండ. అలాంటి కొండపై ఎంతో నిష్ఠగా స్వామివారిని ఆరాధించాల్సింది పోయి. ఇటీవల కాలంలో ఘోర అపచారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న కొండపై మద్యం బాటిల్లు ఆ తర్వాత బిర్యానీ, సిగరెట్లు వంటిపై కొండపై దర్శనం ఇచ్చాయి. ఇవన్నీ భద్రతా సిబ్బంది వైఫల్యాలు. ఇప్పుడు అంతకు మించి. ఘోర అపచారం జరిగింది. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు ఏకంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహా ద్వారం వరకు చెప్పులతో వచ్చారు. ప్రతి దగ్గర ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉండే క్యూ కాంప్లెక్సుల్లో భక్తులు చెప్పులతో తిరగటం అనేది ఇప్పుడు ఊహకు అందని అపచారంగా చూస్తున్నారు భక్తులు.

తిరుమల కొండపై విజిలెన్స్ సెక్యూరిటీ వైఫల్యం మరోసారి భయపడింది. తనిఖీలు చేయకుండానే. తనిఖీలు లేకుండా భక్తులను క్యూ లైన్లలోకి వదిలేస్తున్నారు అనేది ఈ ఘటనతో స్పష్టం అయ్యింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన కొందరు భక్తులు. చెప్పులతో మహా ద్వారం వరకు వచ్చారు. ఈ విషయాన్ని. మహాద్వారం దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గమనించి. ఆ భక్తులకు సూచించటంతో వాళ్లు చెప్పులను మహాద్వారం దగ్గర బయటకు విడిచారు. క్యూ లైన్లలోకి భక్తులను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వదులుతారు. అలాంటిది క్యూ కాంప్లెక్స్ దగ్గర విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు అనేది ప్రశ్నగా ఉంది.


Tags:    

Similar News