TIRUMALA | శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజ

వసంత పంచమి కావడం వల్ల సోమవారం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ పూజ నిర్వహించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-02-03 10:37 GMT

తిరుమల శ్రీవారి ఆలయంలో గతంలో ప్రతి సోమవారం 'వారపుసేవ'గా విశేషపూజను నిర్వహించేవారు. శ్రీవారి ఉత్సవమూర్తుల అరుగుదల నివారించాలనే జీయంగార్లు, అర్చకులు, ఆగమ పండితులు సూచనలు చేశారు. ఈ అభిప్రాయం వ్యక్తం చేయడానికి ప్రధానంగా భవిష్యత్ తరాలకు ఉత్సవమూర్తులు, ప్రాధాన్యత తెలియజేయాలనేది ప్రధాన లక్ష్యం అని టీటీడీ అధికారుులు తెలిపారు. వారి సూచన మేరకు.. తిరుమల శ్రీవారి ఆలయంలో వసంతోత్సవం, సహస్ర కలశాభిశేకం, విశేషపూజను ఏడాదికోసారి నిర్వహించాలని కూడా గతంలోని టీటీడీ బోర్డు నిర్ణయించింది. దీంతో...

తొలిపూజ..


 ప్రతి సంవత్సరం వసంత పంచమి పర్వదినాన వార్షిక విశేషపూజను సర్కార్ (ఏకాంతం)గా టీటీడీ నిర్వహించనుంది. ఆ మేరకు తొలిసారిగా వార్షిక విశేషపూజను వసంత పంచమి సందర్భంగా శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో సోమవారం వైభవం నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చతుర్దశ కలశావాహనం గావించి పుణ్యహవచనం, వివిధ క్రతువులను నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ పూజా కార్యక్రమాలకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News