వైఎస్సార్‌సీపీ నాలుగో జాబితాలో ఐదుగురు అవుట్‌

వైఎస్సార్‌సీపీ విడుదల చేసిన నాలుగో లిస్టులో ఐదుగురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కలేదు;

Byline :  The Federal
Update: 2024-01-19 06:13 GMT
YSRCP

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాలుగో జాబితాను గురువారం రాత్రి విడుదల చేసింది. అందులో ఐదుగురు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు రాలేదు. సీట్లు రాని వారిలో నలుగురు ఎస్సీలు కాగా ఒకరు బీసీ ఉన్నారు. కనిగిరి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి బుర్రా మదుసూదన్‌ యాదవ్‌ గెలుపొందారు. ఆయనకు టిక్కెట్‌ దక్కలేదు. ఇక ఎస్సీల్లో సింగనమల జొన్నలగడ్డ పద్మావతి, నందికొట్కూరు తొగులు ఆర్థర్, తిరువూరు కొక్కిలిగడ్డ రక్షణనిధి, మడకశిర నుంచి తిప్పేస్వామిలు టిక్కెట్లు రాని వారి జాబితాలో ఉనానరు.

వీరి దారెటు?
ఇప్పటి వరకు వీరి నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈరోజు ఈఐదుగురి నుంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జొన్నలగడ్డ పద్మావతి సీఎం జగన్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తిప్పేస్వామి కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బుర్రా మధుసూదన్‌యాద్‌ కూడా జగన్‌ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి బయటపడనప్పటికీ వైఎస్సార్‌సీపీ అధినేత తీరుపై అసంతృప్తితోనే ఉన్నారు.
కృష్ణా జిల్లాలో ఇప్పటికే కొలుసు పార్థసారధికి టిక్కెట్‌ ఇవ్వలేదు. ఈయన కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన వారు. అలాగే విజయవాడ పట్టణం నుంచి సిటీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌ పార్థసారధితో కలిసి పయనించేందుకు నిర్ణయించుకున్నారు. వీరితో పాటు రక్షణనిధి కూడా కలిసి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరంతా ఈనెల 21న తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.


Tags:    

Similar News