అక్కడ గెలిచిన వారిలో ఐదుగురు మహిళలే

మహిళా ఎమ్మెల్యేలు అధికంగా గెలిచిన జిల్లాగా ఉమ్మడి విజయనగరం జిల్లా చరిత్ర సృష్టించింది. 9 స్థానాలకు గాను ఐదు సీట్లను మహిళలే సొంతం చేసుకోవడం విశేషం.

Byline :  The Federal
Update: 2024-06-08 14:20 GMT

ఉమ్మడి విజయనగరం జిల్లా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రత్యేక రికార్డు కావడం గమనార్హం. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలోని ఏ జిల్లాకు లేని ప్రత్యేకత ఉమ్మడి విజయనగరం జిల్లాకు దక్కింది. తక్కిన జిల్లాలతో పోల్చితే విజయనగరం జిల్లాలోనే మహిళా ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువుగా ఉంది. ఏకంగా ఐదుగురు మహిళా ఎమ్మెల్యేలు విజయ దుందిబి మోగించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారిలో ఐదుగురు మహిళా ఎమ్మెల్యేలు కావడం విశేషం. మహామహులను ఓడించి విజయ పతాకాన్ని ఎగువర వేశారు. ఐదుగురూ టీడీపీ నుంచి గెలిచిన నేతలే కావడం గమనార్హం.

ఉమ్మడి విజయనగరం జిల్లాలో సాలూరు, పార్వతీపురం, కురుపాం, బొబ్బిలి, గజపతినగరం, విజయనగరం, శృంగవరపుకోట, నెల్లిమర్ల, చీపురుపల్లి అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. సాలూరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి రాజన్నదొరను మట్టి కరిపించారు. రాజన్నదొరపైన విజయ ఢంకా మోగించారు. దాదాపు 13వేలకు పైచిలుకు ఓట్ల మెజారిటీతో రాజన్నదొరపైన విజయం సాధించారు. మరో వైపు గుమ్మిడి సంధ్యారాణి మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉందనే టాక్‌ ఆ పార్టీ శ్రేణుల్లో సాగుతోంది. అటు లోకేష్‌ అండడండలు, ఇటు చంద్రబాబు అభయ హస్తం ఉండటంతో సంధ్యారాణికి మంత్రి వర్గంలో బెర్త్‌ ఖాయమనే టాక్‌ వినిపిస్తోంది.
తొలి సారి బరిలోకి దిగిన తోయక జగదీశ్వరి కురుపాం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి విజయాన్ని దక్కించుకున్నారు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తోయక జగదీశ్వరి, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణిని ఓడించి విజేతగా నిలవడం గమనార్హం. పాముల పుష్పశ్రీవాణి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న జగదీశ్వరి చివరికి ఆమెపై పై చేయి సాధించారు. తొలిసారి బరిలోకి దిగినా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షించారు.
విజయనగరం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతి రాజు కుమార్తె అదితి విజయలక్ష్మి గజపతిరాజు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామిపై విజయం సాధించారు. అదే విధంగా ఎస్‌ కోట నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోళ్ల లలితకుమారి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుపై విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెల్లిమర్ల నుంచి కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన లోకం మాధవి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బద్దుకొండ అప్పలనాయుడుపై విజయం సాధించి చరిత్ర సృష్టించారు.
తక్కిన సీట్లలోను టీడీపీ అభ్యర్థులే గెలిచి చరిత్ర సృష్టించారు. జిల్లాలోని అన్ని సీట్లలో తెలుగుదేశం పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. అన్ని స్థానాలను టీడీపీ సొంతం చేసుకున్న జిల్లాలో విజయనగరం కూడా ఒకటి.
Tags:    

Similar News